అంధగాడు రిలీజ్ డేట్ ఫిక్సయింది

Wednesday,March 29,2017 - 04:20 by Z_CLU

టాలీవుడ్ లో హ్యాప్పెనింగ్ ఆన్ స్క్రీన్ జోడీ రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన అంధగాడు రిలీజ్ డేట్ ఫిక్సయింది. వెలిగొండ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజ్ తరుణ్ గుడ్డివాడిలా నటించడం ఫస్ట్ ఇంటరెస్టింగ్ ఎలిమెంట్.

రాజేంద్ర ప్రసాద్ ఓ కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నాడు. డిఫెరెంట్, స్ట్రాంగ్ అండ్ ఎగ్జైటెడ్ పాయింట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా యూనిట్ ప్రస్తుతం ఇటలీలో పాటల్ని తెరకెక్కించే పనిలో బిజీగా ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ తో సహా అన్ని పనులు కంప్లీట్ చేసుకుని సినిమాని మే 26 న రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది అంధగాడు టీమ్.

కుమారి 21 F, ఈడోరకం ఆడోరకం లాంటి బ్లాక్ బస్టర్స్ తరవాత మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్న రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ కాంబినేషన్ పై న్యాచురల్ గానే ఎక్స్ పెక్టేషన్స్ రోజు రోజుకీ రేజ్ అవుతున్నాయి. దానికి తోడు ఉగాది స్పెషల్ గా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ ఆటోమేటిక్ గా కాన్సంట్రేషన్ ని తన వైపు తిప్పుకుంటుంది. ఈ సినిమాకి శేఖర్ చంద్ర మ్యూజిక్ కంపోజ్ చేశాడు.