ఉగాది స్పెషల్ లుక్స్

Wednesday,March 29,2017 - 01:51 by Z_CLU

టాలీవుడ్ ఉగాదికి గ్రాండ్ వెల్కం చెప్పింది. సరికొత్త ఫస్ట్ లుక్స్ తో పాటు అప్పటికే రిలీజైన సినిమాలు ఉగాది విషెస్ తో, కలర్ ఫుల్ పోస్టర్స్ తో సినిమా లవర్స్ ని మెస్మరైజ్ చేసేశాయి.

ఆల్ రెడీ రిలీజై ఉగాది పండగని ఓ ఐదు రోజులు ముందుగానే థియేటర్స్ లోకి పట్టుకొచ్చిన కాటమరాయుడు సినిమా యూనిట్, ఉగాది స్పెషల్ లుక్ ని రిలీజ్ చేసింది. రిలీజ్ కి ముందు నుండే సోషల్ మీడియాలో మ్యాగ్జిమం స్పేస్ ని ఆక్యుపై చేసుకున్న కాటమరాయుడు, ఈ ఉగాది లుక్ తో ఫ్యాన్స్ లో సరికొత్త జోష్ ని నింపేశాడు.

మంచి విష్ణు హీరోగా కామెడీ కింగ్ బ్రహ్మానందం ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో G. నాగేశ్వర రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న అల్టిమేట్ హిలేరియస్ ఎంటర్ టైనర్ అమెరికా ఆచారి యాత్ర. మాస్ ఎంటర్ టైనర్స్ కన్నా ఫన్ లోడెడ్ కాన్సెప్ట్స్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే విష్ణు, ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

స్పెషల్ లుక్ కృష్ణవంశీ మార్క్ తో ఎట్రాక్ట్ చేస్తుంది. సాయి ధరం తేజ్ స్పెషల్ రోల్ లో, సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా సైలెంట్ గానే సినీ టౌన్ లో క్యూరాసిటీ క్రియేట్ చేస్తుంది.

ఇంకో రెండు రోజుల్లో మ్యాగ్జిమం సినిమా థియేటర్స్ ని బాక్సింగ్ రింగ్స్ లా మారనున్నాయి. విక్టరీ వెంకటేష్ టఫ్ఫెస్ట్ బాక్సింగ్ కోచ్ గా తెరకెక్కిన ‘గురు’ మార్చి 31st థియేటర్స్ లో ఎంటర్ తింక్ హేయనుంది. ఈ లపు ఉగాది విషెస్ చెప్తూ రిలీజైన ఫస్ట్ లుక్, వెంకీ ఫ్యాన్స్ లో మరింత ఎగ్జైట్ మెంట్ ని జెనెరేట్ చేసేసింది.

మార్చి 31 న రిలీజ్ కి రెడీగా ఉన్న రోగ్ కూడా స్పెషల్ లుక్ తో ఉగాది విషెస్ ని అందించింది. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా, మ్యాగ్జిమం యూత్ ని ఇప్పటికే ఎట్రాక్ట్ చేసేసింది.ఇక బాక్సాఫీస్ దగ్గర ప్రూఫ్ చేసుకోవడమే బ్యాలన్స్.

వేణు మాదికంటి డైరెక్షన్ లో తెరకెక్కిన అల్టిమేట్ థ్రిల్లర్ వెంకటాపురం. మర్డర్ మిస్టరీ మెయిన్ ఎలిమెంట్ గా తెరకెక్కిన ఈ సినిమాలో హ్యాపీడేస్ ఫేం రాహుల్ హీరోగా నటించాడు. ఈ సినిమాతో మహిమా మఖ్వానా హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అవుతుంది. రీసెంట్ గా రిలీజైన ట్రేలర్ ఈ సినిమా పట్ల స్పెషల్ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తే, ఈ ఉగాది స్పెషల్ లుక్ దాని డోస్ ని ఇంకాస్త పెంచేస్తుంది.

వరుణ్ తేజ్ హీరోగా నటించిన మిస్టర్ ఏప్రియల్ 14 నుండి థియేటర్స్ లో రొమాంటిక్ మ్యాజిక్ ని స్ప్రెడ్ చేయడానికి రెడీ అవుతుంది. అల్ రెడీ రీసెంట్ గా రిలీజైన ట్రేలర్ సినిమా సూపర్ హిట్ గ్యారంటీ అనే ఒపీనియన్ ని కలెక్ట్ చేసింది. ఉగాది సందర్భంగా రిలీజైన ఈ ఫస్ట్ లుక్ లో కొత్తగా ఏదీ రివీల్ కాకపోయినా, సినిమా రిలీజ్ డేట్ ని మరోసారి గుర్తుకు చేసింది మిస్టర్.

గోపీచంద్ హీరోగా సంపత్ నంది డైరెక్షన్ లో తెరకెక్కిన అల్టిమేట్ క్లాస్ ఎంటర్ టైనర్ గౌతమ్ నంద. హన్సిక మోత్వాని, కేథరిన్ థెరిసా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో ఉంది.

నాగ చైతన్య, రకుల్ ప్రీత్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్  టైనర్ ‘రారండోయ్ వేడుక చూద్దాం’ రెండేసి ఫస్ట్ లుక్స్ రిలీజయ్యాయి. ఒక ఫస్ట్ లుక్ లో నాగ చైతన్య యాక్షన్ మోడ్ లో కనిపిస్తే, మరొకటి ఉగాది ఫీల్ ని కలిగిస్తుంది. ఈ సినిమా కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది.

 

ఈ రేంజ్ లో హంగామా చేస్తున్న ఉగాది సంబరాల్లో నిఖిల్ ‘కేశవ’ కూడా తన బ్రాండ్ మార్క్ ని చూపించాడు. ఇప్పటికే ట్రేలర్ సమ్ థింగ్ స్పెషల్ మూవీ గ్యారంటీ అనిపించుకున్న నిఖిల్, ఉగాది స్పెషల్ లుక్ తో మరోసారి ఆల్ రెడీ క్రియేట్ అయిన ఇంట్రెస్ట్ ని మరోసారి తట్టి లేపాడు.

రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జంటగా వెలిగొండ శ్రీనివాస డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా అందగాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ లో పంచెకట్టుతో నిండైన తెలుగుదనంతో ఎట్రాక్ట్ చేస్తున్నాడు రాజ్ తరుణ్.

ఏప్రియల్ 7 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది చెలియా. కార్తి, అదితి రావు హైదరి జంటగా నటించిన ఈ సినిమా మణిరత్నం డైరెక్షన్ లో తెరకెక్కింది. అల్టిమేట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా యూనిట్ కూడా  టాలీవుడ్ సంబరాల్లో ఉగాది  స్పెషల్ లుక్ ని షేర్ చేసుకుంది.