నాగ్, నానిల ‘దేవదాస్’ టైటిల్ అలా ఫిక్సయింది

Wednesday,September 26,2018 - 03:03 by Z_CLU

టాలీవుడ్ లో ఎక్కడ చూసినా దేవ, దాస్ లా హంగామా అనిపిస్తుంది. సినిమా సక్సెస్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్న టీమ్, అగ్రెసివ్ గా సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘జీ సినిమాలు’ కి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చిన నాగ్, ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు చెప్పుకున్నాడు. మరీ ముఖ్యంగా ఈ సినిమా టైటిల్ గురించి…

కంప్లీట్ స్టోరీ రెడీ అయ్యాక నాగ్ ని సంప్రదించిన టీమ్, అప్పటికే నాగ్, నాని ల క్యారెక్టర్స్ కి దేవ, దాస్ అని పేర్లు ఫిక్స్ చేసుకుని, కథ చెప్పడం పూర్తయ్యాక సినిమా టైటిల్ ‘దేవదాస్’ అని పెడ్తే బావుంటుంది కదా అని రివీల్ చేశారట. అప్పటికి గాని వాళ్ళ ప్లాన్ అర్థం కాలేదట నాగ్ కి. ఏది ఏమైనా నాగ్ కి ఆ టైటిలే పర్ఫెక్ట్ అనిపించడంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టైటిల్ ఫైనల్ చేసుకున్నారట ఫిలిమ్ మేకర్స్.

ఈ సినిమాకి కనెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్స్, ఈ సినిమాలోని దేవ, దాస్ ల క్యారెక్టర్సే అని చెప్పుకున్న నాగార్జున, క్యారెక్టర్స్ చాలా రియల్ గా ఉండటంతో అసలు యాక్ట్ చేయాల్సిన అవసరమే రాలేదు, చాలా రియల్ గా ఉంటారు దేవ, దాస్ లు అని చెప్పుకున్నాడు. ఈ సినిమా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు నాగ్ మాటల్లో వినాలంటే ఈ వీడియో చూడండి.