ఆకాంక్ష సింగ్ లక్కీ అనిపించుకుంటుందా..?

Wednesday,September 26,2018 - 04:06 by Z_CLU

సుమంత్ తో ‘మళ్ళీరావా’ సినిమాలో నటించి ఫస్ట్ సినిమాతోనే హిట్ అందుకున్న ఆకాంక్ష సింగ్, రెండో సినిమాకే నాగ్ సరసన నటించే లక్కీ చాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో న్యూస్ రీడర్ గా కనిపించనున్న ఆకాంక్ష, ఈ సినిమాలో నాగ్ లవ్ ఇంట్రెస్ట్ లా మెస్మరైజ్ చేయనుంది.

‘దేవదాస్’ సినిమా చుట్టూ క్రియేట్ అవుతున్న వైబ్స్ చూస్తుంటే, ఆకాంక్ష సింగ్, ఈ సినిమా సక్సెస్ తో టాలీవుడ్ లో సెటిలయ్యే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫస్ట్ మూవీ తరవాత ఇమ్మీడియట్ గా వైజయంతీ లాంటి ప్రెస్టీజియస్ బ్యానర్ లో, అందునా నాగార్జున హీరోయిన్ గా జస్ట్ 2 సినిమాలతో స్టార్ హీరోయిన్ అనిపించుకునే స్థాయిని అందుకుంది ఆకాంక్ష.

ఫ్రెండ్ షిప్ బేస్డ్ హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది దేవదాస్. శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా, మరికొన్ని గంటల్లో థియేటర్స్ లో ఎంటర్ టైన్ చేయనుంది.