దేవదాస్ వెనక అసలు కథ ఇదే

Wednesday,September 26,2018 - 02:30 by Z_CLU

రేపు వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది ‘దేవదాస్’… నాగ్ -నాని కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా గురించి లేటెస్ట్ గా ఓ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ బయటపెట్టాడు నాని..

ఈ సినిమా కథ ఐడియాగా విని చాలా రోజులైందని… ఎట్టకేలకు ఇప్పటికి కుదిరిందని చెప్పుకొచ్చాడు… నిజానికి బాలీవుడ్ రైటర్ శ్రీధర్ రాఘవన్ ఈ కథను నిర్మాత అశ్వనీదత్ కి అలాగే నాగార్జున, నానికి ఎప్పుడో వినిపించాడట.. కాకపోతే ఈ కథ పూర్తిగా సెట్ చేయడానికి చాలా టైం పట్టింది.. పైగా ఈ కథతో నాగ్-నాని ను డీల్ చేయగల దర్శకుడి కోసమే చాలా ఏళ్ళు ఎదురుచూశారట. ఒకానొక టైంలో అన్ని కుదిరినప్పుడు చూద్దాంలే అంటూ ఈ సినిమాను లైట్ తీసుకున్నాడట నాని… ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం బయటపెట్టాడు నాచురల్ స్టార్.

‘శమంతకమణి’ ట్రైలర్ చూసిన తర్వాత ‘భలే మంచి రోజు’ సినిమాలో స్క్రీన్ ప్లే గురించి కూడా తెలుసుకొని దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యను ఈ సినిమాకు రిఫర్ చేసాడట నాని.. అయితే ఈ కథను ఈ యంగ్ డైరెక్టర్ పర్ఫెక్ట్ గా డీల్ చేయగలడని నమ్మిన అశ్వనీదత్, నాగార్జున.. ‘దేవదాస్’ ప్రాజెక్ట్ ను ఫైనల్ గా శ్రీరామ్ ఆదిత్య చేతిలో పెట్టారట.

సో.. శ్రీరామ్ రాఘవన్ రాసిన ఈ కథ కొన్నేళ్లుగా కొందరు రైటర్స్ తో ట్రావెల్ అవుతూ ఎట్టకేలకి రేపు థియేటర్స్ లో ప్రేక్షకులను ‘దేవదాస్’ గా అలరించబోతోందన్నమాట.