బాహుబలి-2 మొదటి రోజు ఆలిండియా వసూళ్లు

Saturday,April 29,2017 - 12:58 by Z_CLU

ఊహించినట్టే ప్రపంచవ్యాప్తంగా బాహుబలి-2 సంచలనాలు ప్రారంభమయ్యాయి. ప్రతి ఏరియా నుంచి పాజిటివ్ టాక్ తో ప్రారంభమైన ఈ భారీ బడ్జెట్ చిత్రం, వసూళ్లలో కూడా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటివరకు అందిన లెక్కల ప్రకారం బాహుబలి సినిమాకు ఒక్క ఇండియాలోనే 144 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. ఓ భారతీయ చిత్రానికి డొమస్టిక్ బాక్సాఫీస్ లో మొదటి రోజే వంద కోట్ల రూపాయల గ్రాస్ రావడం చరిత్రలో ఇదే ఫస్ట్ టైం.

బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్, అమీర్, షారూక్ లాంటి హీరోలకు కూడా ఇప్పటివరకు సాధ్యం కాని రికార్డును బాహుబలి-2 సాధించి చూపించింది. మొదటి రోజు బాహుబలి-2 సినిమాకు ఆలిండియా లెవెల్లో వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి. (వసూళ్లు గ్రాస్ లో..)

ఆంధ్రప్రదేశ్ + తెలంగాణ – 58 కోట్లు
హిందీ వెర్షన్ – 50 కోట్లు
కర్ణాటక – 19.5 కోట్లు
తమిళనాడు – 11 కోట్లు
కేరళ – 5.5 కోట్లు
టోటల్ – 144 కోట్లు