బాలీవుడ్ లో బాహుబలి-2 సంచలనం

Saturday,April 29,2017 - 01:15 by Z_CLU

కనీవినీ ఎరుగని సంచలనం నమోదైంది. బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్ని సైతం బాహుబలి-2 క్రాస్ చేసింది. ఏకంగా కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించిన సినిమానే దాటేసింది బాహుబలి – ది కంక్లూజన్ సినిమా. ప్రస్తుతం బాలీవుడ్ లో విడుదలైన మొదటి రోజు అత్యథిక వసూళ్లు సాధించిన సినిమాగా బాహుబలి-2 నిలిచింది.

ఇప్పటివరకు ఫస్ట్ డే కలెక్షన్లలో సల్మాన్ ఖాన్ దే రికార్డు. అతడు నటించిన ప్రేమ రథన్ థన్ పాయో సినిమాకు విడుదలైన రోజు దాదాపు 39కోట్ల రూపాయలు వచ్చాయి. ఇండియాలో ఫస్ట్ డే వసూళ్లలో ఇదే రికార్డు. ఇప్పుడీ రికార్డును బాహుబలి-2 అధిగమించింది. బాలీవుడ్ లో బాహుబలి-2 హిందీ వెర్షన్ కు ఏకంగా 40కోట్ల రూపాయలు వచ్చాయి.

సల్మాన్ సినిమాను బాహుబలి-2 క్రాస్ చేసిందనేది వాస్తవం. అయితే ఈ లెక్క మరింత పెరిగే అవకాశం ఉంది. ఢిల్లీ, పంజాబ్, ఉత్తరాఖండ్, ఒరిస్సా లోని కొన్ని ప్రాంతాల నుంచి ఇంకా అధికారికంగా లెక్కలు బయటకు రాలేదు. అవి కూడా వస్తే బాహుబలి-2 హిందీ వెర్షన్ కు వచ్చిన వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.