బాహుబలి-2 ప్రభంజన షురూ

Saturday,April 29,2017 - 12:32 by Z_CLU

ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన బాహుబలి-2 సినిమా.. ఫస్ట్ డే నుంచే రికార్డులు సృష్టించడం ప్రారంభించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు బాలీవుడ్, ఓవర్సీస్ లో ఈ సినిమాకు కళ్లుచెదిరే కలెక్షన్లు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా చరిత్ర సృష్టించింది. మొదటి రోజే 43 కోట్ల రూపాయల షేర్ వచ్చింది ఈ సినిమాకి.

నైజాం ఏరియా విషయానికొస్తే ఎప్పట్లానే నైజాం ఏరియాలో బాహుబలి-2 అత్యథిక వసూళ్లు సాధించింది. గురువారం ప్రీమియర్స్ తో పాటు శుక్రవారం అన్ని షోల వసూళ్లను కలుపుకుంటే ఈ సినిమాకు ఏకంగా 9కోట్ల 30లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఇప్పటివరకు నైజాంలో ఇదే అత్యథికం.

ఇక ఏరియా వైజ్ చూసుకుంటే, సీడెడ్ లో 6కోట్ల 10లక్షల రూపాయలు… వెస్ట్ లో 6 కోట్ల 8లక్షలు.. గుంటూరులో 6 కోట్ల 18లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఇక ప్రపంచవ్యాప్తంగా బాహుబలి-2 సినిమాకు మొదటి రోజే దాదాపు 2వందల కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు తెలుస్తోంది.