ఒక్క ఇండియాలోనే 1000 కోట్లు

Thursday,May 25,2017 - 02:04 by Z_CLU

వరుస రికార్డులతో దూసుకుపోతున్న బాహుబలి-2 సినిమా భారత్ లో సరికొత్త రికార్డు సృష్టించింది. తాజాగా ఈ సినిమా కేవలం ఇండియాలోనే వెయ్యి కోట్ల రూపాయల నెట్ సాధించింది. ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమాకు సాధ్యంకాని ఫీట్ ఇది. ఈ అరుదైన ఘనతకు కేవలం 3 వారాల రన్ లోనే అందుకుంది బాహుబలి-2.

ఈ సినిమా హిందీ వెర్షన్ కు ఇండియాలో ఇప్పటివరకు 481 కోట్ల రూపాయలు వచ్చాయి. అటు తెలుగు, తమిళ, మలయాళం వెర్షన్లు కలుపుకొని 520 కోట్లు కలెక్ట్ చేసింది బాహుబలి-2. ఈ మొత్తం వసూళ్లు వెయ్యి కోట్ల రూపాయల నెట్ ను తాకాయి. ఇండియాలో ఈ సినిమా ఇంకా స్ట్రాంగ్ గా కొనసాగుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఇప్పటికీ ఈ సినిమాకు పోటీ లేదు.

అటు వరల్డ్ వైడ్ వసూళ్లు చూస్తే బాహుబలి-2 సినిమా 1586 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. 23వ తేదీ నాటికి ఇండియాలో ఈ సినిమాకు 1291 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. అటు ఓవర్సీస్ లో 295 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది బాహుబలి-2. ఈ మొత్తం వసూళ్లతో బాహుబలి-2 సినిమా 1586 కోట్ల రూపాయలతో దూసుకుపోతోంది.