బాహుబలి 2 రిలీజై రేపటికి 50 రోజులు

Thursday,June 15,2017 - 02:36 by Z_CLU

ఇండియాలోనే ఓ సరికొత్త చరిత్ర సృష్టించిన ‘బాహుబలి 2 ‘ రిలీజై రేపటికి సరిగ్గా 50 రోజులు. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఒక్క తెలుగులోనే 194 కోట్ల రూపాయల షేర్ కలెక్ట్ చేసింది.ఇక బాలీవుడ్ లో అయితే నంబర్ వన్ మూవీగా అవతరించింది. 300, 400 కోట్ల క్లబ్స్ ను క్రియేట్ చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 1680 కోట్ల రూపాయల వసూళ్లతో సరికొత్త చరిత్ర సృష్టించింది బాహుబలి-2.

బాహుబలి పార్ట్-1 వరల్డ్ వైడ్ హిట్ అవ్వడంతో.. పార్ట్-2పై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలన మించి బాహుబలి – ది కంక్లూజన్ ను తెరకెక్కించాడు దర్శక ధీరుడు రాజమౌళి. విడుదలైన మొదటి రోజు నుంచి ఇవాళ్టి వరకు ఈ సినిమా రోజుకో సంచలనం సృష్టిస్తూనే ఉంది.

ఈ 50 రోజుల్లో పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో బాహుబలి-2ను ప్రదర్శించారు. కేన్స్ ఫిలింఫెస్టివల్, గోవా ఫిలిం ఫెస్టివల్స్ తోపాటు రొమేనియా మూవీ ఫెస్ట్ లో బాహుబలి-2ను ప్రదర్శించారు. త్వరలోనే జరగనున్న మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రారంభ చిత్రంగా బాహుబలి-2ను ప్రదర్శించబోతున్నారు.

మరోవైపు ఈ సినిమాను కొన్ని యూరోప్ దేశాలతో పాటు చైనాలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.