మొట్టమొదటి 300 కోట్ల సినిమా

Wednesday,May 31,2017 - 07:06 by Z_CLU

వరల్డ్ వైడ్ గా రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న బాహుబలి 2, తెలుగు స్టేట్స్ లో ఇప్పటివరకు కలెక్ట్ చేసిన షేర్ 301.75 కోట్లు. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా సాధించలేని ఘనత ఇది. అసలు టాలీవుడ్ కు ఇంత మార్కెట ్ఉందని కూడా ఎవరూ ఊహించలేదు. అలా కేవలం 33 రోజుల్లోనే సరికొత్త చరిత్ర సృష్టించింది బాహుబలి-2.

అటు బాలీవుడ్ లో కూడా ఈ సినిమా ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే నంబర్ వన్ హిందీ సినిమాగా అవతరించిన బాహుబలి-2 హిందీ వెర్షన్.. తాజాగా మరో రేర్ ఫీట్ క్రియేట్ చేసింది. బాలీవుడ్ లో 5వందల కోట్ల రూపాయల క్లబ్ ను క్రియేట్ చేసింది బాహుబలి-2. నిన్నటి వసూళ్లతో కలుపుకొని ఈ సినిమా హిందీ వెర్షన్ కు 503 కోట్ల రూపాయల నెట్ వచ్చింది.

మరోవైపు ఈ సినిమాను యూరోప్ దేశాలతో పాటు చైనాలో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జూన్ ల ో ఈ విడుదల తేదీలను అఫీషియల్ గా ప్రకటించనున్నారు. ఈ కలెక్షన్స్ కూడా యాడ్ అయితే.. వరల్డ్ వైడ్ వసూళ్లలో బాహుబలి-2 మూవీ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం.