రజనీ కొత్త సినిమా పేరు 'కాలా'

Thursday,May 25,2017 - 01:00 by Z_CLU

ఇటీవలే ‘కబాలి’ సినిమాలో డాన్ గా ఎంటర్టైన్ చేసిన సూపర్ స్టార్ మరో సారి అలాంటి క్యారెక్టర్ లోనే ఎంటర్టైన్ చేయబోతున్నాడు. ‘కబాలి’ దర్శకుడు పా.రంజిత్ దర్శకత్వంలో తెరక్కెనున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ లోగో ను లేటెస్ట్ గా సోషల్ మీడియా ద్వారా రివీల్ చేశారు యూనిట్.

తమిళ్, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో తెరకెక్కనుంది కాలా. రజనీకాంత్ అల్లుడు ధనుష్ ఈ సినిమాకు నిర్మాత. ఈ నెలాఖరు నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. బాలీవుడ్ బ్యూటీ హుమా ఖురేషీని హీరోయిన్ గా సెలక్ట్ చేశారు.

కబాలి సినిమాలో మలేషియాలోని తమిళుల కోసం పోరాడి డాన్ గా మారతాడు రజనీకాంత్. తాజా మూవీ కాలాలో ముంబయిలో  తమిళులపై జరుగుతున్న అకృత్యాలపై పోరాటం సాగించే వ్యక్తిగా కనిపించనున్నాడు. 80ల్లో ముంబయిలో మాఫియా డాన్ గా చలామణి అయిన ఓ వ్యక్తి కథ ఆధారంగా కాలా తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీత దర్శకుడు.