అంధగాడు ప్రీ రిలీజ్ ఈవెంట్

Thursday,May 25,2017 - 03:04 by Z_CLU

జూన్ 2 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతున్న ‘అంధగాడు’ మే 28 న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోనుంది. కామెడీ, యాక్షన్, రొమాన్స్, యాక్షన్ లాంటి ఫుల్ టూ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమాలో రాజ్ తరుణ్ అంధుడిలా కనిపించడం, దాంతో పాటు సిల్వర్ స్క్రీన్ పై హై ఎండ్ క్రేజ్ ని క్రియేట్ చేసుకున్న హెబ్బా, రాజ్ తరుణ్ మరోసారి జంటగా కనిపించనుండటం ఈ సినిమాపై సరికొత్త ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది.

ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు గుమ్మడి కాయ ఫంక్షన్ ని కూడా అదే రోజు జరుపుకోనున్న సినిమా యూనిట్, ఈ ఫంక్షన్ తరవాత సినిమా ప్రమోషన్స్ స్పీడ్ ని మరింత పెంచే ఆలోచనలో ఉంది. ఇప్పటికే సరికొత్త టీజర్స్ తో, సాంగ్స్ తో సినిమా పట్ల ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసుకున్న సినిమా యూనిట్, సినిమా బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉంది. రాజేంద్ర ప్రసాద్ కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా వెలిగొండ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కింది. శేఖర్ చంద్ర ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేశాడు.