బాహుబలి-2.. విడుదలై నెల రోజులు

Sunday,May 28,2017 - 07:15 by Z_CLU

ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయిన బాహుబలి ది కంక్లూజన్ సినిమా వసూళ్లలో మరిన్ని రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే 1500 కోట్ల రూపాయల క్లబ్ ను క్రాస్ చేసిన ఈ మూవీ.. తాజాగా 1600 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. రేపోమాపో ఆ మార్క్ కూడా దాటేసి 1700 కోట్ల రూపాయలు అందుకునే దిశగా దూసుకుపోతోంది.

నిన్నటికి బాహుబలి-2 సినిమా థియేటర్లలోకి వచ్చి సరిగ్గా నెలరోజులైంది. ఈ 30 రోజుల్లో ఊహించని రికార్డులు సృష్టించిన ఈ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా 1623 కోట్ల రూపాయల గ్రాస్ కొల్లగొట్టింది.

బాహుబలి-2 30 రోజుల వసూళ్లు (వరల్డ్ వైడ్)
ఇండియా
నెట్ – 1024 కోట్లు
గ్రాస్ – 1321 కోట్లు

ఓవర్సీస్
గ్రాస్ – 302 కోట్లు

మొత్తం – 1623 కోట్లు (గ్రాస్)