బాహుబలి-2.. 1000 కోట్ల వసూళ్లు

Sunday,May 07,2017 - 01:03 by Z_CLU

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్న కీలకపాత్రల్లో నటించిన బాహుబలి- ది కంక్లూజన్ సినిమా సరికొత్త చరిత్ర సృష్టించింది. వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లతో బాహుబలి-2 సినిమా ఇండియన్ సినీ హిస్టరీలోనే ఓ నూతన అధ్యాయాన్ని లిఖించింది. ఈ సినిమాకు ఇండియాలో 800 కోట్లు,  ఓవర్సీస్ లో 200 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి.

ఇప్పటివరకు ఏ బాలీవుడ్ సినిమాకు దక్కని అరుదైన గౌరవం ఇది. 2 వారాలు పూర్తయినా బాహుబలి-2 మేనియా ఇంకా కొనసాగుతూనే ఉంది. మరిన్ని దేశాల్లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు సాగాయి. ఈ లెక్క చూసుకుంటే బాహుబలి-2 సినిమా భవిష్యత్తులో మరిన్ని వసూళ్లు సాధించే అవకాశముంది.