జీ తెలుగు (29th మే)

Sunday,May 28,2017 - 10:55 by Z_CLU

గణేష్

నటీ నటులు : వెంకటేష్, రంభ, మధుబాల

ఇతర నటీనటులు : బ్రహ్మానందం, చంద్ర మోహన్, కోట శ్రీనివాస్ రావు, రేవతి, అశోక్ కుమార్.

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : తిరుపతిస్వామి

నిర్మాత : రామా నాయుడు

రిలీజ్ డేట్ : 19 జూన్ 1998

‘ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్- గణేష్’ . ఈ డైలాగ్ కొన్ని రోజుల వరకు యూత్ నోటిలో ఊతపదంలా వినిపించేది అంత ఇంపాక్ట్ చూపించింది గణేష్ సినిమా. ఒక సాధారణ జర్నలిస్ట్ రోల్ లో అతి సహజంగా నటించాడు విక్టరీ వెంకటేష్. కరప్టెడ్ డాక్టర్స్ వల్ల తన కుటుంబంలో చోటు చేసుకున్న విషాదంతో, తిరగబడ్డ గణేష్ ఎలా సంఘ విద్రోహులను మట్టి కరిపించాడు అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ గణేష్. మణిశర్మ సంగీతం సినిమాకి ఎసెట్.

=============================================================================

Mr. నూకయ్య

నటీ నటులు : మంచు మనోజ్, కృతి కర్బందా, సనా ఖాన్

ఇతర నటీనటులు :రాజా,  బ్రహ్మానందం, మురళి శర్మ ,రఘు బాబు,పరుచూటి వెంకటేశ్వరావు, వెన్నెల కిషోర్, ఆహుతి ప్రసాద్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : యువన్ శంకర్ రాజా

డైరెక్టర్ : అనిల్ కన్నెగంటి

నిర్మాత : డి.ఎస్.రావు

రిలీజ్ డేట్ : 8  మార్చ్ 2012 మంచు మనోజ్ సరి కొత్త ఎనర్జీ తో ఆవిష్కరించిన సినిమా ‘మిస్టర్ నూకయ్య’. అనిల్ డైరెక్షన్ లో తెరకెక్క్కిన ఈ సినిమా లవ్ & యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందింది. ముఖ్యంగా  యువన్ శంకర్ రాజా అందించిన పాటలు ఈ సినిమాకు హైలైట్. ఈ సినిమాలో లవ్ సీన్స్, కామెడీ, పాటలు, క్లైమాక్స్ లో ట్విస్ట్ అందరినీ ఆకట్టుకుంటాయి.

==============================================================================

తెలుగమ్మాయి

నటీనటులు : సలోని, విక్రమ్

ఇతర నటీనటులు : యశ్వంత్, హర్ష, సాయిచంద్, షఫీ, తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : వందేమాతరం శ్రీనివాస్

డైరెక్టర్ : రాజా వన్నెం రెడ్డి

ప్రొడ్యూసర్ : వనపల్లి బాబు రావు

రేపిస్టును చంపడం నేరమా..? అనే కథాంశంతో తెరకెక్కిందే తెలుగమ్మాయి. సలోని తెలుగమ్మాయిగా ఎట్రాక్ట్ చేస్తుంది. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం సినిమాకే హైలెట్.

==============================================================================

 

దోచెయ్ 

హీరోహీరోయిన్లు – నాగచైతన్య, కృతి సనోన్

ఇతర నటీనటులు – బ్రహ్మానందం, రవిబాబు, పోసాని, సప్తగిరి, ప్రవీణ్

సంగీతం – సన్నీ

దర్శకత్వం – సుధీర్ వర్మ

విడుదల తేదీ – 2015, ఏప్రిల్ 24

స్వామిరారా సినిమాతో అప్పటికే సూపర్ హిట్ అందుకున్న సుధీర్ వర్మకు పిలిచిమరీ ఛాన్స్ ఇచ్చాడు నాగచైతన్య. స్వామిరారా సినిమాతో తన మార్క్ ఏంటో చూపించిన సుధీర్ వర్మ… తన  రెండో ప్రయత్నంగా తీసిన దోచెయ్ సినిమాకు కూడా అదే ఫార్మాట్ ఫాలో అయ్యాడు. మహేష్ సరసన వన్-నేనొక్కడినే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కృతి సనోన్ కు ఇది రెండో సినిమా. అలా వీళ్లందరి కాంబోలో తెరకెక్కిన దోచెయ్ సినిమా కుర్రాళ్లను బాగానే ఎట్రాక్ట్ చేసింది. సన్నీ సంగీతం అదనపు ఆకర్షణ. క్లయిమాక్స్ కు ముందొచ్చే బ్రహ్మానందం కామెడీ టోటల్ సినిమాకే హైలెట్.

=============================================================================

 

భాయ్

నటీనటులు : నాగార్జున, రీచా గంగోపాధ్యాయ్

ఇతర నటీనటులు : బ్రహ్మానందం, ఆశిష్ విద్యార్థి, సోను సూద్, ముకుల్  దేవ్, సాయాజీ షిండే, నాగి నీదు, ఎం.ఎస్.నారాయణ, జయప్రకాశ్ రెడ్డి, చలపతి రావు,కె.విశ్వనాధ్, ఎం.ఎస్.నారాయణ, రఘు బాబు,వెన్నెల కిషోర్,అజయ్, ఆదిత్య మీనన్,  తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

రచన, స్క్రీన్ ప్లే ,డైరెక్టర్ : వీర భద్రం చౌదరి

ప్రొడ్యూసర్ : అక్కినేని నాగార్జున

రిలీజ్ డేట్ : 25 అక్టోబర్ 2013

నాగార్జున కథానాయకుడిగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘భాయ్’. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మాణం లో దర్శకుడు వీరభద్రం తెరకెక్కిన ఈ చిత్రం లో భాయ్ గా నాగార్జున నటన, యాక్షన్ ఎపిసోడ్, రీచా గంగోపాధ్యాయ్ గ్లామర్,  దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ హైలైట్స్. ఈ చిత్రం లో బ్రహ్మానందం, రఘు బాబు, వెన్నెల కిషోర్ కామెడీ అలరిస్తుంది.

==============================================================================

123 ఫ్రం అమలాపురం

నటీనటులు : రవి ప్రకాష్, రాజా శ్రీధర్, అనిల్, నిత్యా దాస్

ఇతర నటీనటులు : ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కృష్ణ భగవాన్, కొండవలస, మల్లాది రాఘవ, MVS హరనాథ రావు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : వెంకటేశ్వర

డైరెక్టర్ : వర్మ

ప్రొడ్యూసర్ : 9 మూవీ మేకర్స్

రిలీజ్ డేట్ : 19 ఆగస్టు 2005

అల్లరిచిల్లరగా తిరిగే ముగ్గురు యువకులు, టెన్నిస్ చాంపియన్ కావాలని కలలు కంటున్న ఒక అమ్మాయి కలను నిజం చేయడానికి ఏం చేశారు..? ఆ ప్రయత్నం వారి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకువచ్చింది అన్నదే ఈ సినిమా కథాంశం.