హ్యాట్రిక్ కొట్టిన నాగచైతన్య

Sunday,May 28,2017 - 06:32 by Z_CLU

ఈ రోజుల్లో వరుసగా 3 విజయాలు అందుకోవడం చాలా కష్టం. అది కూడా 3 డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ స్టోరీలైన్స్ తో సక్సెస్ అందుకోవడం మరీ కష్టం. నాగచైతన్య మాత్రం సాధించాడు. లాస్ట్ ఇయర్ ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో సినిమాలతో సక్సెస్ అందుకున్న ఈ అక్కినేని యువతరంగం.. ఈ ఏడాది రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అలా బ్యాక్ టు బ్యాక్ 3 విజయాలు అందుకొని దూసుకుపోతున్నాడు.

చైతూ నటించిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమాకు రోజురోజుకు పాజిటివ్ మౌత్ టాక్ పెరుగుతోంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు కుటుంబ ప్రేక్షకులతో పాటు యూత్ కూడా కనెక్ట్ అయ్యారు. అలా మొదటి రోజు కళ్లుచెదిరే వసూళ్లు రాబట్టిన రారండోయ్ మూవీ.. సెకెండ్ డే కూడా మంచి కలెక్షన్లు అందుకుంది. ఆర్భాటాలకు పోకుండా లిమిటెడ్ గా విడుదలైన ఈ సినిమా 2 రోజుల్లో 6 కోట్ల రూపాయల షేర్ సాధించి చైతూ కెరీర్ లోనే బెస్ట్ అనిపించుకుంది.

చైతూ-రకుల్ జంటగా నటించిన ఈ సినిమాకు కల్యాణ్ కృష్ణ దర్శకుడు. అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మించిన ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు.