రూ.1500 కోట్లు కొల్లగొట్టిన బాహుబలి-2

Friday,May 19,2017 - 10:32 by Z_CLU

 

బాహుబలి-2 మరో చరిత్ర సృష్టించింది. మొన్నటికి మొన్న వెయ్యి కోట్ల కలెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు నంబర్ ను 1500 కోట్లుకు చేర్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటివరకు 1500 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఇది కేవలం 21 రోజుల్లో సాధించిన వసూళ్లు మాత్రమే. బాహుబలి-2కు ఇంకా చాలా ఏరియాల్లో స్ట్రాంగ్ గా ఉంది.

ప్రస్తుతానికి బాహుబలి-2కు పోటీగా అటుఇటుగా దంగల్ మాత్రమే ఉంది. అమీర్ నటించిన దంగల్ సినిమాకు చైనాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. సో.. వరల్డ్ వైడ్ వసూళ్లలో ఈ సినిమా కూడా 1500 కోట్లు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా బాహుబలి-2 వసూళ్లు ఇలా ఉన్నాయి.

ఇండియా

నెట్ – 953 కోట్లు

గ్రాస్ – 1227 కోట్లు

ఓవర్సీస్

గ్రాస్ – 275 కోట్లు

మొత్తం – 1502 కోట్లు