బాహుబలి-2 మొదటి వారం రోజుల వసూళ్లు

Friday,May 05,2017 - 11:15 by Z_CLU

ప్రస్తుతం ఇండియాలో బిగ్గెస్ట్ హిట్ బాహుబలి-2. విడుదలైన వారం రోజులకే ఆలిండియాా నంబర్ వన్ మూవీగా అవతరించింది ఈ సినిమా. తన జెట్ స్పీడ్ తో… సల్మాన్, షారూక్, అమీర్ లాంటి హీరోలు సృష్టించిన రికార్డుల్ని అవలీలగా క్రాస్ చేసింది బాహుబలి – ది కంక్లూజన్ మూవీ.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిన్నటికి విడుదలై సరిగ్గా వారం రోజులైంది. ఈ వారం రోజుల్లో ఇండియాలో, ఓవర్సీస్ లో ఓవరాల్ గా ఈ సినిమాకు ఎన్ని వసూళ్లు వచ్చాయో చూద్దాం.

బాహుబలి-2 వారం రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు

ఇండియా
షేర్ – 545 కోట్లు
గ్రాస్ – 695 కోట్లు

ఓవర్సీస్
గ్రాస్ – 165 కోట్లు

మొత్తం వసూళ్లు 860 కోట్లు (గ్రాస్)

త్వరలోనే ఈ సినిమా వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లు సాధించి సరికొత్త రికార్డు సృష్టించబోతోంది. మరోవైపు ఈ సినిమాను చైనా, జపాన్ దేశాల్లో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.