నాగచైతన్య యుద్ధం శరణంలో ఎట్రాక్టివ్ పాయింట్

Monday,August 28,2017 - 12:27 by Z_CLU

నాగచైతన్య ‘యుద్ధం శరణం’ సెప్టెంబర్ 8 న రిలీజ్ కి రెడీ అవుతుంది. నిన్న రిలీజైన ఆడియో యూత్ ని ఎట్రాక్ట్ చేస్తుంది. అల్టిమేట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్ రోల్ ప్లే చేశాడు. అయితే నిన్నటి ఈవెంట్ లో మాట్లాడిన నాగచైతన్య ఈ సినిమాలో హీరో సరికొత్త వెపన్ ని వాడాడని చెప్పుకున్నాడు.

ఇంటెలిజెన్స్ బేస్డ్ యాక్షన్ సీక్వెన్సెస్ లో హీరో సోషల్ మీడియాని, టెక్నాలజీని ఎలా వాడాడు అనేది ఈ సినిమాలో మోస్ట్ ఎట్రాక్టివ్ పాయింట్ అని చెప్పాడు. ఎటువంటి వయోలెన్స్ లేకుండా మోస్ట్ పవర్ ఫుల్ విలన్ ని ఫేస్ చేయడానికి హీరో టెక్నాలజీని వెపన్ లా వాడి, విలన్ ని ఎలా ఫేస్ చేశాడు అన్నదే ఈ సినిమాలో మోస్ట్ ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్ కానుంది.

నాగ చైతన్య సరసన లావణ్య త్రిపాఠి నటించిన ఈ సినిమాకి వివేక్ సాగర్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. సాయి కొర్రపాటి నిర్మించిన ఈ సినిమాకి కృష్ణ ఆర్. మరిముత్తు డైరెక్టర్.