పెళ్ళి సింపుల్ గా రిసెప్షన్ గ్రాండ్ గా...

Saturday,September 09,2017 - 05:02 by Z_CLU

టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ ఇంటరెస్టింగ్ ఎలిమెంట్ నాగచైతన్య సమంతాల పెళ్ళి. అక్కినేని వారింట జరగబోయే ఈ గ్రాండ్ వేడుక కోసం ఫ్యాన్స్ ఎగ్జైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే పెళ్ళి వేడుకలను గోవాలో చాలా సింపుల్ గా ప్లాన్ చేసుకుంటున్న నాగ చైతన్య, సమంతా అక్టోబర్ 6 న తెలుగు సాంప్రదాయం ప్రకారం, 7 న క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం పెళ్ళి చేసుకోబోతున్నారు.

 

పెళ్ళి జస్ట్ ఫ్యామిలీ క్లోజ్ రిలేటివ్స్ మధ్య జరుపుకున్నా, రిసెప్షన్ మాత్రం చాలా గ్రాండ్ గా జరుపుకోనున్నట్టు తెలిపాడు నాగ చైతన్య. నిన్న మొన్నటి వరకు జస్ట్ ఆన్ స్క్రీన్ ఎంటర్ టైన్ చేసిన ఈ జంట, మరికొన్ని రోజుల్లో ఆఫ్ స్క్రీన్ కూడా బ్యూటిఫుల్ రియల్ కపుల్ గా మెస్మరైజ్ చేయనుంది.