జీ సినిమాలు (28th ఆగష్టు)

Sunday,August 27,2017 - 11:11 by Z_CLU

దేవత

నటీనటులుశోభన్ బాబు, శ్రీదేవి

ఇతర నటీనటులుజయప్రద, మోహన్ బాబు, రావుగోపాల్రావు

సంగీతంచక్రవర్తి

దర్శకత్వంకె.రాఘవేంద్రరావు

విడుదల తేదీ – 1982, సెప్టెంబర్ 4

దేవత పేరుచెప్పగానే బిందెలు గుర్తొస్తాయి. చీరలతో చేసిన డెకరేషన్ గుర్తొస్తుంది. ఆ వెంటనే ఓ సూపర్ హిట్ సాంగ్ గుర్తొస్తుంది. అదే వెల్లువొచ్చి గోదారమ్మ పాట. దర్శకుడు కె.రాఘవేంద్రరావు, సంగీత దర్శకుడు చక్రవర్తి కాంబినేషన్ లో చాలా సినిమాలొచ్చాయి. వాటిలో ఎన్నో పాటలు హిట్ అయ్యాయి. కానీ దేవతలోని ఈ పాట మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతుంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన  ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.

=============================================================================

 

సూరిగాడు

నటీనటులు : సురేష్, యమున

ఇతర నటీనటులు : దాసరి నారాయణ రావు, సుజాత, సురేష్, గొల్లపూడి, వేలు, రాళ్ళపల్లి, కాంతారావు, బ్రహ్మానందం, బాబూ మోహన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : వాసూ రావు

డైరెక్టర్ : దాసరి నారాయణ రావు

ప్రొడ్యూసర్ : డి. రామా నాయుడు

రిలీజ్ డేట్:  1992

కష్టపడి పెంచిన తలిదండ్రులను కన్నా బిడ్డలే పట్టించుకోకపోతే ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు తెరకెక్కించారు డైరెక్టర్ దాసరి నారాయణరావు. ఈ సినిమాలో తండ్రి పాత్ర కూడా స్వయంగా ఆయనే పోషించారు. ఈ సినిమాలో ‘ఒకే ఒక ఆశ’ అంటూ సాగే పాట సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది.

==============================================================================

ఒక ఊరిలో

నటీనటులు : తరుణ్, రాజా, సలోని

ఇతర నటీనటులు : చంద్ర మోహన్, నరేష్, కల్పన, రామరాజు, యమునా, నిరోషామ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : రమేష్ వర్మ

ప్రొడ్యూసర్ : చంటి అడ్డాల

రిలీజ్ డేట్ : 1 జూలై 2005

లవర్ బాయ్ తరుణ్, తెలుగమ్మాయి సలోని జంటగా నటించిన లవ్ ఎంటర్ టైనర్ ఒక ఊరిలో. ఒక అందమైన ఊరిలో మొదలైన ప్రేమకథ ఏ మలుపు తిరిగింది. చివరికి ఏమైంది అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా మంచి ఫీల్ గుడ్ సినిమా అనిపించుకుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి హైలెట్.

=============================================================================

   

సీతారాముల కళ్యాణం లంకలో  

నటీనటులు : నితిన్, హన్సిక

ఇతర నటీనటులు : సుమన్, సలీమ్, చంద్ర మోహన్, ప్రగతి, బ్రహ్మానందం, వేణు మాధవ్, ఆలీ, M.S.నారాయణ, సుబ్బరాజు, దువ్వాసి మోహన్, జయ ప్రకాష్ రెడ్డి

మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్

డైరెక్టర్ : ఈశ్వర్

ప్రొడ్యూసర్ : మల్ల విజయ్ ప్రసాద్

రిలీజ్ డేట్ : జనవరి 22, 2010

భయమంటే ఏమిటో తెలియని ఒక యంగ్ స్టర్ ఫ్యాక్షనిస్ట్ కూతురితో ప్రేమలో పడతాడు. ఆ ప్రేమను దక్కించుకోవడానికి, తను ప్రేమించిన అమ్మాయిని ప్రమాదం నుండి కాపాడటానికి ఏం చేశాడు అనే కథాంశంతో తెర కెక్కింది సీతారాముల కళ్యాణం లంకలో. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ హైలెట్ గా నిలుస్తాయి.

==============================================================================

రాఖీ

నటీనటులు : NTR, ఇలియానా, చార్మి

ఇతర నటీనటులు : సుహాసిని, రవి వర్మ, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, చంద్ర మోహన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : కృష్ణవంశీ

ప్రొడ్యూసర్ : K.L. నారాయణ

రిలీజ్ డేట్ : 22 డిసెంబర్ 2006

NTR, కృష్ణవంశీ కాంబినేషన్ లో తెరకెక్కిన రాఖీ ఇద్దరి కరియర్ లోను డిఫరెంట్ సినిమా. ఆడపిల్లలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఒక యువకుడు చట్టాన్ని తన చేతిలోకి తీసుకుని పోరాటం చేయడమే రాఖీ సినిమా ప్రధానాంశం. ఈ సినిమాలో ఛార్మి నటన హైలెట్.

==============================================================================

 

ఆ ఇంట్లో

నటీనటులు : చిన్నా, మయూరి

ఇతర నటీనటులు : వినోద్ కుమార్, దేవన, కోట శ్రీనివాస రావు

మ్యూజిక్ డైరెక్టర్ : కోటి

డైరెక్టర్ : చిన్న

ప్రొడ్యూసర్ : S. శ్రీనివాస రెడ్డి , రాజు చౌదరి

రిలీజ్ డేట్ : 2009

చిన్నా ప్రధాన పాత్రలో నటించిన ఆ ఇంట్లో హారర్ ఎంటర్ టైనర్. తన ఇద్దరు పిల్లలతో కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిన హీరో అక్కడ ఏం చూశాడు..? అక్కడి పరిస్థితులను ఎదుర్కోవడానికి తాంత్రికుడిని కలుసుకున్న హీరో ఏం తెలుసుకున్నాడు అనేదే ప్రధాన కథాంశం.