చైతు కోసమే వెయిటింగ్ ఇక్కడ...

Tuesday,January 22,2019 - 12:51 by Z_CLU

ఆల్మోస్ట్ ‘వెంకీ మామ’  స్క్రిప్ట్ ని లాక్ చేసుకున్నారు మేకర్స్. చైతు సరసన రకుల్ ప్రీత్ ని హీరోయిన్ గా కూడా ఫిక్స్ చేసుకున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం హైదరాబాద్ లోనే భారీ సెట్ కూడా వేయనున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి డిస్కర్షన్స్ జరుగుతున్నాయి.

‘F2’ సక్సెస్ తో బ్యాక్ టు ఫామ్ అనిపించుకున్నాడు వెంకీ. ఇక మిగిలింది మేనల్లుడితో కలిసి స్క్రీన్ పై మరోసారి అదే రేంజ్ మ్యాజిక్ జెనెరేట్ చేయడమే. అందుకే వెంకీ తో పాటు సినిమా యూనిట్ కూడా చైతు కోసం వెయిట్ చేస్తుంది. ప్రస్తుతం ‘మజిలీ’ తో బిజీగా ఉన్న చైతు, ఈ సినిమా కంప్లీట్ చేయగానే, ఏ మాత్రం డిలే లేకుండా, మ్యాగ్జిమం మార్చి కల్లా సినిమాని సెట్స్ పైకి తీసుకువచ్చే ఆలోచనలో ఉంది టీమ్.

బాబీ డైరెక్షన్ లో తెరకెక్కనుంది ‘వెంకీమామ’.  త్వరలో వెంకీ సరసన జోడీ కట్టనున్న హీరోయిన్ డీటేల్స్  కూడా రివీల్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించనున్నాయి.