షూటింగ్ అప్ డేట్స్

Wednesday,January 10,2018 - 07:01 by Z_CLU

భరత్ అనే నేను

క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల తర్వాత తిరిగి కొత్త సినిమా షెడ్యూల్ ప్రారంభించాడు మహేష్. కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమా నయా షెడ్యూల్ హైదరాబాద్ లో కొనసాగుతోంది. నగర శివార్లలోని శంకర్ పల్లిలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాతో కైరా అద్వాని హీరోయిన్ గా పరిచయమౌతోంది.

సాహో

ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాహో సినిమా షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. రీసెంట్ గా ప్రారంభమైన ఈ షెడ్యూల్ ఈ నెలంతా కొనసాగుతుంది. ప్రభాస్, నీల్ నితిన్ ముకేష్, శ్రద్ధా కపూర్ పై కీలక సన్నివేశాలు తీస్తున్నారు. ఈ షెడ్యూల్ తర్వాత కీలకమైన దుబాయ్ షెడ్యూల్ ఉంటుంది.

నాగార్జున, వర్మ సినిమా

హలో సినిమా పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ కోసం వర్మతో చేస్తున్న సినిమాకు గ్యాప్ ఇచ్చాడు నాగార్జున. అలా షార్ట్ గ్యాప్ తర్వాత ఈ సినిమా షూటింగ్ మళ్లీ మొదలైంది. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఈ మూవీ షెడ్యూల్ జోరుగా సాగుతోంది. ఈ సినిమాతో మైరా సరీన్ హీరోయిన్ గా పరిచయమౌతోంది.

రంగస్థలం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘రంగస్థలం’.  ప్రస్తుతం  ఈ సినిమా షూటింగ్  హైదరాబాద్  భూత్ బంగ్లా లో జరుగుతుంది. వచ్చే వారం రాజమండ్రి లో  కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తారు.  ఈ షెడ్యుల్ లో కొన్ని కీలక సీన్స్ తో పాటు పూజా హెగ్డే పై స్పెషల్ సాంగ్ ను చిత్రీకరించి జనవరి చివరి కల్లా టోటల్ షూటింగ్ కి ప్యాకప్ చెప్పబోతున్నారు.

రవితేజ – కళ్యాణ్ కృష్ణ సినిమా

కళ్యాణ్ కృష్ణ – రవితేజ సినిమా ప్రస్తుతం గచ్చి బౌలి సమీపం లో ఓ హాస్పిటల్ లో జరుగుతుంది.  రవితేజతో కలిసి కమెడియన్స్ ప్రియదర్సి, ప్రవీణ్ తదితరులపై సన్నివేశాలు షూట్ చేస్తున్నారు.  ఒకే షెడ్యుల్ లో సినిమాను పూర్తి చేసే ప్లాన్ లో ఉంది యూనిట్. ఈ సినిమాకు నేల టికెట్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

 

లవర్

రాజ్ తరుణ్ హీరోగా అనిష్ కృష్ణ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న లవర్ సినిమా షూటింగ్ ప్రస్తుతం అనంతపురంలో జరుగుతుంది. ఇటీవలే ఒక షెడ్యుల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండో షెడ్యుల్ లోకి ఎంటరైంది. దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాత.

సవ్యసాచి

నాగచైతన్య లేటెస్ట్ మూవీ సవ్యసాచి. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాతో నిషా అగర్వాల్ హీరోయిన్ గా పరిచయమౌతోంది. భూమిక, మాధవన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.