రామ్ కెరీర్ లో ఓ మైలు రాయి అవ్తుంది. - అనుపమ

Saturday,October 14,2017 - 01:48 by Z_CLU

ప్రస్తుతం వరుస సూపర్ హిట్స్ దూసుకెళ్తున్న మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ గా రామ్ తో కలిసి నటించి సినిమా ‘ఉన్నది ఒకటే జిందగీ’.. ఇటివలే ఈ ఆడియో రిలీజ్ ఈవెంట్ లో తెలుగులో మాట్లాడుతూ తన స్పీచ్ తో అందరినీ మెస్మరైజ్ చేసింది ఈ భామ.

ఈ సినిమా గురించి అనుపమ మాట్లాడుతూ ” ‘ఉన్నది ఒకటే జిందగీ’ నా జిందగీ లో బిగ్గెస్ట్ మెమొరీ…ఈ సినిమాలో నేను చేసిన మహా అనే క్యారెక్టర్ ఒక మనిషిగా నన్ను చాలా మార్చింది. ఈ సినిమాలో పార్ట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. కిషోర్ గారితో వర్క్ చేయడం ఒక మంచి అనుభూతి కలిగించింది. అప్పుడేమో ‘ఐ లవ్ యు- బట్ ఐయాం నాట్ ఇన్ లవ్ విత్ యు’ అని శైలజ తో చెప్పించారు… ఇప్పుడు డోంట్ వర్రీ తొందర్లోనే ఏడుస్తావ్ అని మహా తో చెప్పించారు. ఇలాంటి బ్యూటిఫుల్ లైన్ డైలాగ్స్ తో ఆకట్టుకోవడం కిషోర్ గారికే చెందింది. రైటర్ గా దర్శకుడిగానే కాదు ఒక మనిషిగా కూడా కిషోర్ గారు ది బెస్ట్. ‘శతమానం భవతి’ తర్వాత మళ్ళీ వెంటనే సమీర్ రెడ్డి గారితో పని చేయడం హ్యాపీ గా ఫీలయ్యాను. ఇక రామ్ కలిసి పని చేయడం వెరీ హ్యాపీ. అసలు రామ్ కి అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. రామ్ కెరీర్ లో ‘అభి’ అనే క్యారెక్టర్ ఓ మైలు రాయి అవ్తుంది. ఇక సినిమా చూసాక శ్రీ విష్ణు అలా పిలవడం మానేసి వాసు అని పిలుస్తారు. చాలా మంచి క్యారెక్టర్ చాలా బాగా చేశారు. ఇక ఈ సినిమాతో మొదటి సారిగా లావణ్య తో కలిసి పని చేయడం హ్యాపీ గా ఉంది. డి.ఎస్.పి గారి సాంగ్స్ కి ఎప్పటి నుంచో పెద్ద ఫ్యాన్. ఈ సినిమాకి కూడా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు ఆయనకీ స్పెషల్ థాంక్స్. టీం అందరికీ నా థాంక్స్ ” అంటూ తెలుగులో ఆదరగోట్టేసింది అనుపమ.