ఈ సినిమాతో ఆ అవకాశం దొరికింది - లావణ్య త్రిపాటి

Saturday,October 14,2017 - 02:22 by Z_CLU

ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న బ్యూటిఫుల్ బ్యూటీ లావణ్య త్రిపాటి తనకి పెర్ఫాం చేసే స్కోప్ ఉన్న క్యారెక్టర్ దొరికిందని చెప్పుకొచ్చింది. లేటెస్ట్ గా ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాలో మ్యాగీ అనే క్యారెక్టర్ చేసిన ఈ భామ ఈ సినిమా గురించి ఆడియో వేడుకలో స్పెషల్ గా మాట్లాడింది.

ఈ సినిమా గురించి లావణ్య త్రిపాటి మాట్లాడుతూ ” నటి గా పెర్ఫాం చేసే స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ రావాలని అందరూ అనుకుంటారు. ఈ సినిమాలో నాకు బాగా నటించే స్కోప్ ఉన్న మంచి క్యారెక్టర్ దొరికింది. ఈ సందర్భంగా ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిందుకు డైరెక్టర్ కిషోర్ తిరుమల గారికి నా థాంక్స్. కిషోర్ గారు ఈ కథ చెప్తున్నప్పుడు చాలా నవ్వుతూ, ఫీల్ అవుతూ ,ఎంజాయ్ చేస్తూ విన్నాను. రవి కిషోర్ గారు ఒక నిర్మాతగా కాకుండా ఒక ఫ్యామిలీ పర్సన్ లా ట్రీట్ చేస్తూ మా అందరితో చాలా ఫ్రెండ్లీ గా వర్క్ చేయించుకున్నారు.రామ్ గురించి చెప్పాలంటే ఒక హీరోగా ఫ్యాషన్ తో వర్క్ చేస్తాడు. తనకి సినిమా అంటే చాలా ఇంట్రెస్ట్…యాక్ట్ చేసే టప్పుడు తనలో అది కనిపిస్తుంది. డాన్స్ చేసే తప్పుడు తన ఎనర్జీ చూసి షాక్ అయ్యాను.సెట్ లో చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశాం. డి.ఎస్.పి నాకు మంచి ఫ్రెండ్.. సినిమాకు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. టీం అందరికీ థాంక్స్. ఈ సినిమా కచ్చితంగా అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది ” అన్నారు.