సినిమా చూశాక కఛ్చితంగా మీ బెస్ట్ ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తారు. - డి.ఎస్.పి

Saturday,October 14,2017 - 01:07 by Z_CLU

‘నేను శైలజ’ వంటి సూపర్ హిట్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఏవైటింగ్ మూవీ ‘ఉన్నదీ ఒకటే జిందగీ’… అక్టోబర్ 27న థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఆడియోలో తన దైన ఎనర్జిటిక్ స్పీచ్ తో ఆకట్టుకున్నాడు రాక్ స్టార్ డి.ఎస్.పి..

ఈ సినిమా గురించి దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ” కిషోర్ గారితో వర్క్ చేయడం చాలా సరదాగా ఉంటుంది.అలాగే ఇన్స్పైర్ గా కూడా ఉంటుంది.ఆయన కథ చెప్పేటప్పుడే స్టార్టింగ్ టూ ఎండింగ్ వరకూ ఆయనేమనుకుంటున్నారో.. సాంగ్స్ ఎలా తీద్దామనుకుంటున్నారో కూడా క్లారిటీ గా చెప్పేస్తారు.ఆయన కథ చెప్పేటప్పుడే ఆటో మేటిక్ గా ట్యూన్ వచ్చేస్తుంది.అలా వచ్చిందే వాట్ అమ్మ సాంగ్. కిషోర్ గారిలో డైలాగ్స్ లో చాలా డిఫరెంట్ సెన్స్ ఆఫ్ హుమార్ ఉంటుంది. అది ట్రైలర్ చూస్తుంటే తెలిసిపోతుంది.. ట్రైలర్ అదిరిపోయింది. ఇక ఫస్ట్ హాఫ్ లో అనుపమ, సెకండ్ హాఫ్ లో లావణ్య త్రిపాటి కుమ్మేశారు. వాసు గా శ్రీ విష్ణు చాలా బాగా చేశాడు. హీరో అభిరాం క్యారెక్టర్ కి సమానంగా ఉండే క్యారెక్టర్ ఇది. నిజంగా ఈ సినిమా చేయడం రామ్ గొప్పతనం. అందుకు రామ్ ని అభినందించాల్సిందే. సినిమా చూశాక ప్రతీ ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి ఓ మాటేసుకుంటారు. పక్కనే ఉంటె వాటేసుకుంటారు.. అంతలా ఈ సినిమాకి కనెక్ట్ అయిపోతారు. స్రవంతి మూవీస్ బ్యానర్ లో  చేయడం ఎప్పుడూ హ్యాపీ గానే ఉంటుంది. రవి కిషోర్ గారు డిగ్నిఫైడ్ నిర్మాతగా వ్యవహరిస్తారాయణ.. గ్రేట్ ప్రొడ్యూసర్. నేను ఇప్పటి వరకూ పని చేసిన మోస్ట్ లవబుల్ ప్రొడ్యూసర్ లో రవి కిశోర్ గారు కూడా ఒకరు. ఈ సినిమాకు నాతో కలిసి పని చేసిన  నా సింగర్స్ , లిరిక్ రైటర్స్ కి స్పెషల్ థాంక్స్ ” అన్నారు.