అంధగాడు ఫస్ట్ సింగిల్ రిలీజయింది

Tuesday,May 09,2017 - 05:20 by Z_CLU

రాజ్ తరుణ్ అంధగాడు ఆడియో రిలీజ్ ప్రాసెస్ బిగిన్ అయింది. సినిమా యూనిట్ ముందుగానే అనౌన్స్ చేసినట్టు ‘దెబ్బకి పోయే పోయే’ రిలీజయింది. భాస్కర భట్ల రాసిన ఈ పాటని ధనుంజయ్, శేఖర్ కలిసి పాడారు. రిలీజ్ అయిన ఈ ఫస్ట్ సింగిల్ చూస్తుంటే శేఖర్ చంద్ర మ్యూజిక్ సినిమాకి ఎట్రాక్టివ్ ఎలిమెంట్ లా మారే చాన్సెస్ కనిపిస్తున్నాయి.

ఇప్పటికే ఎట్రాక్టివ్ టీజర్ తో క్రేజ్ ని క్రియేట్ చేసుకున్న ఈ అంధగాడు, సినిమా రిలీజయ్యే లోపు మ్యూజిక్ తో మ్యాగ్జిమం కాన్సంట్రేషన్ తిప్పుకునే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. వెలిగొండ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా AK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కింది. క్రేజీ ఆన్ స్క్రీన్ పెయిర్ అనిపించుకున్న రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ ఈ సినిమాతో మరోసారి యూత్ ని మెస్మరైజ్  చేయనున్నారు.