నాగచైతన్య తోనే ఫస్ట్

Tuesday,May 09,2017 - 05:00 by Z_CLU

రాధ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది లావణ్య త్రిపాఠి. ఈ సినిమాలో కాలేజీ గర్ల్ గా ఎంటర్ టైన్ చేయనున్న లావణ్య, నాగచైతన్య సరసన క్రిష్ణ మరిముత్తు డైరెక్షన్ లో ఆల్ రెడీ సెట్స్ పై ఉన్న సినిమా విషయంలోను సూపర్ ఎగ్జైటెడ్ గా ఉంది.

సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో నాగార్జున సరసన నటించి ఇమ్మీడియట్ గా నాగచైతన్య హీరోయిన్ గా నటిస్తున్న లావణ్య, ఇద్దరితో పని చేయడం గ్రేట్ ఫీలింగ్ అని చెప్తూనే, తెలుగు ప్రేక్షకులు సినిమాలో క్యారెక్టర్ తో  కనెక్ట్ అవుతారు కాన్ఫిడెంట్ గా ఉంది.

అయినా నాగార్జున కన్నా ముందే ‘మనం’ సినిమాలో నాగచైతన్య నటించేశానని, ఆ తర్వాతే నాగార్జునతో నటించే చాన్స్ వచ్చిందని చెప్పుకున్న లావణ్య, ఈ సినిమాలో నాగచైతన్య, తన కెమిస్ట్రీ సూపర్బ్ గా ఉండబోతుందని ఎగ్జైటెడ్ గా చెప్పుకుంది లావణ్య త్రిపాఠి.