మరో మూవీ అనౌన్స్ చేసిన విజయ్ దేవరకొండ

Tuesday,May 09,2017 - 06:06 by Z_CLU

‘పెళ్లి చూపులు’ సినిమాతో సూపర్ అందుకొని హీరోగా వరుస సినిమాలతో బిజీ హీరో గా మారిన విజయ్ దేవరకొండ లేటెస్ట్ గా మరో సినిమాను అనౌన్స్ చేశాడు. ప్రెజెంట్ రెండు సినిమాలతో బిజీ షెడ్యూల్ గడుపుతున్న విజయ్ తన జన్మదినాన్ని పురస్కరించుకొని మరో సినిమాను అనౌన్స్ చేసి ఓ వైలెంట్ స్టిల్ తో అందరినీ అట్రాక్ట్ చేస్తూ హంగామా చేస్తున్నాడు…

కోపంతో రగిలిపోతున్న విజయ్ దేవరకొండను ఓ యువతి కంట్రోల్ చేస్తున్నట్లుగా ఉన్న ఈ ఫస్ట్ లుక్ ప్రెజెంట్ సోషల్ మీడియా లో హంగామా చేస్తుంది..”పెళ్లి చూపులు” సినిమాలో ఒక భాగం అయిన నిర్మాణ సంస్థ “బిగ్ బెన్ సినిమాస్” బ్యానర్ పై యష్ రంగినేని నిర్మాతగా కొత్త దర్శకుడు భరత్ కమ్మ డైరెక్షన్ లో యాక్షన్ లవ్ డ్రామాగా రూపొందనున్నఈ సినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు విజయ్..