అల్లు శిరీష్ ఇంటర్వ్యూ

Tuesday,May 29,2018 - 04:29 by Z_CLU

రేపు తన 31 వ సెలెబ్రేట్ చేసుకోనున్నాడు అల్లు శిరీష్. ప్రస్తుతం 3 సినిమాలతో బిజీ బిజీగా ఉన్న మెగా హీరో ఈ రోజు మీడియాతో తన ఫ్యూచర్ సినిమాల గురించి మాట్లాడాడు.

ఈ సంవత్సరం ప్లానింగ్…

ఈ ఇయర్ 2 సినిమాలు చేస్తున్నాను. ‘ABCD – అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ’. ఈ సినిమాని మలయాళంలో దుల్కర్ సల్మాన్ చేశాడు. ఆ సినిమాకి రీమేక్ ఇది. దీంతో పాటు  K.V. ఆనంద్ డైరెక్షన్ లో సూర్య, మోహన్ లాల్ సినిమాలో కూడా నటిస్తున్నా.

చాల పెద్ద ఫ్యాన్..

నేను సూర్య గారికి చాలా పెద్ద ఫ్యాన్. అలాంటి స్టార్ తో కలిసి పనిచేయబోతున్నందుకు చాలా హ్యాప్పీగా ఉంది. చాలా మంచి క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను ఈ సినిమాలో. జూలై 1 నుండి  లండన్ లో ఈ సినిమా షూటింగ్ బిగిన్ అవుతుంది.

 

అంతకన్నా చెప్పలేను…

నేను సూర్య  సినిమా గురించి ఎక్కువగా రివీల్ చేయలేను కానీ  చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. అదొక్కటి చెప్పగలను. ఈ సినిమా గురించి ఏ విషయం రివీల్ చేయాలన్న K.V. గారి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది.

‘ఒక్కక్షణం’ వల్లే ఇదంతా…

డైరెక్టర్  K.V. గారికి నేనెవరో కూడా తెలీదు. ఆ యూనిట్  లో నన్ను రిఫర్ చేస్తే  ‘ఒక్కక్షణం’ సినిమా చూసి, ఇంప్రెస్ అయి  నన్ను ఫిక్స్ చేసుకున్నారు.

రీమేక్ చేయడం చాలా ఇష్టం…          

మనం అనుకుంటాం కానీ సినిమాని రీమేక్ చేయడం చాలా కష్టం. మన నేటివిటీ విషయానికి వచ్చేసరికి చేంజెస్ చేసుకోవాలి, ఈ ప్రాసెస్ లో ఒక్కోసారి సినిమా సోల్ మిస్సయ్యే చాన్సెస్ ఉంటాయి. అందుకే ABCD విషయంలో కూడా చేంజెస్ చేస్తున్నాం, ముఖ్యంగా క్లైమాక్స్ మారుస్తున్నాం…

కథలు లేక కాదు…

మన సినిమాలు ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ అవుతున్నాయి. అంత మాత్రాన బాలీవుడ్ లో కథలు లేక కాదు. అలాగే మనం కూడా… మన దగ్గర చాలా కథలున్నాయి. కానీ వేరే లాంగ్వేజ్ లో ఏదైనా మంచి సినిమా ఉంటే రీమేక్ చేయడంలో తప్పు లేదు…

బన్ని వినాల్సిందే…

నా ప్రతి సినిమా స్టోరీ బన్ని వింటాడు. ఫస్ట్ నాన్న వింటారు. ఆ తర్వాత ఏమైనా చేంజెస్ ఉంటే చేసి, ఫైనల్ అయ్యాక బన్నికి ఫ్రెష్ గా వినిపిస్తా… ఆ తరవాత సినిమా అయ్యాక ఫైనల్ కాపీ చూస్తాడు…

ABCD షూటింగ్…

18th నుండి షూటింగ్ బిగిన్ చేస్తున్నాం… జూన్, జూలై 2 నెలలు ఇక్కడే  షూటింగ్ ఉంటుంది. ఆగష్టులో U.S. కి వెళ్తాం. కథ అక్కడే స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ లో సూర్య సినిమా షెడ్యూల్ ఉంటుంది కాబట్టి, ఈ లోపు ఈ సినిమా  కంప్లీట్ చేయాలి అనుకుంటున్నాం,  కానీ ఎగ్జాక్ట్ గా ఏ డేట్ అనుకోలేదు…

అదే క్యారెక్టర్…

ABCD లో హీరో రెస్పాన్సిబిలిటీస్ లేకుండా ఉంటాడు. అలాంటి వాణ్ణి ఎలా దారిలో పెట్టాలో అర్థం కాక, ఇండియాని మించిన యూనివర్సిటీ లేదని, నెలకు 5000  ఇచ్చి ఇక్కడికి పంపిస్తారు. అలాంటి పరిస్థితుల్లో హీరో  ఏం చేస్తాడు..? పారిపోతాడా..? మారతాడా..? అనేదే సినిమా…

శ్రీకాంత్ అడ్డాలతో సినిమా…

ప్రస్తుతానికైతే ఏదీ లేదు. మా మధ్య డిస్కర్షన్ కూడా ఏం జరగలేదు . గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చాలా మంది డైరెక్టర్స్ కి స్టోరీ చెప్పాక అడ్వాన్స్ ఇస్తారు. అది నాన్న డెసిషన్.

స్పీడ్ పెంచుదామనుకుంటున్నా…

నాన్నని, అన్నయ్యని చూస్తే స్లో గా, సంవత్సరానికి ఒక సినిమా చేస్తే ఫోకస్డ్ గా ఉంటాము అనిపిస్తుంది. కానీ కమర్షియల్ గా వర్కవుట్ అవ్వాలంట్ స్పీడ్ పెంచాల్సిందే. అందుకే ఇక నుండి సినిమాలు సైమల్టేనియస్ గా చేద్దామనుకుంటున్నా…

బర్త్ డే సెలెబ్రేట్ చేసుకోను…

నేను పుట్టినప్పటి నుండి మహా అయితే 3 సార్లు బర్త్ డే సెలెబ్రేట్ చేసుకున్నాను. నాకు బర్త్  డే సెలెబ్రేట్ చేసుకోవడం లాంటివి పెద్దగా ఇష్టం ఉండదు.

 

యాంకరింగ్ ఇష్టం…

నాకు థియేటర్స్ అంటే చాలా ఇష్టం. సినిమాలు రాకముందే ఉంటే ఎంచక్కా నాటకాలు వేసే వాళ్ళం కదా అనుకుంటూ ఉంటా.. అలాంటిది స్టేజ్ పై యాంకరింగ్ అంటే, కొంచెం అలాంటిదే కాబట్టి చేశాను…  యాంకరింగ్ అంటే చాలా ఇష్టం.

టాలీవుడ్ ఆ ఇమేజ్ ని దాటేసింది..

నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ సినిమాలంటే జస్ట్ మాస్, మసాలా సినిమాలు. మహా అయితే టాప్ స్టార్స్ రీమేక్ చేసుకోవడానికి పనికొస్తాయి అనుకునే వాళ్ళు.. కనీసం కంట్రీలో ఫిల్మ్ ఫెస్టివల్స్ కి కూడా మన సినిమాలు పంపడం లేదు.. బాలీవుడ్ తరవాత టాలీవుడ్ కి ఆ రేంజ్  ఉంది. మన సినిమాలు  కూడా ఫిల్మ్ ఫెస్టివల్ కి వెళ్ళాలి.

అది మన రేంజ్…

మన ఇండస్ట్రీలో 100 కోట్లు అంటే చాలా కామన్ అయిపోయింది. కానీ ఇప్పటికీ  కొన్ని లాంగ్వేజెస్ లో 100 కోట్లు అనేది పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ కూడా వసూలు చేయవు… టాలీవుడ్ కి అంత రేంజ్ ఉంది.

ప్లాన్ చేయలేం…

100 కోట్లు మనం అనుకున్నంత  మాత్రం  రావు… జరిగిపోతాయంతే…

అదే నేర్చుకున్నా…

ఇన్నేళ్ళ నా కరియర్ లో తెలుసుకున్నదేమిటంటే  ‘సినిమా బావుంటేనే చూస్తారు.. మెగా ఫ్యామిలీ నుండి వచ్చినంత మాత్రాన సినిమాలు చూడరు…’.