ఎన్టీఆర్-కాజల్ కాంబోలో మరో స్పెషల్ సాంగ్?

Tuesday,May 29,2018 - 05:02 by Z_CLU

ఇంతకుముందు ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమాలో ఐటెంసాంగ్ చేసింది కాజల్. ఇప్పుడు వరుసగా రెండోసారి అదే ఫీట్ రిపీట్ కాబోతోంది. అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీలో కూడా కాజల్ ఐటెంసాంగ్ చేయబోతోంది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో “అరవింద సమేత వీర రాఘవ” అనే సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఓ స్పెషల్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారట. అందులో కాజల్ తో స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకు ఎన్టీఆర్ అడిగిన వెంటనే కాజల్ ఓకే అన్నట్టు టాక్.

 ఈమధ్య తన ప్రతి సినిమాలో ఓ ఐటెంసాంగ్ ప్లాన్ చేస్తున్నాడు ఎన్టీఆర్. జనతా గ్యారేజ్ లో కాజల్ ను తీసుకున్నాడు. ఆ తర్వాతొచ్చిన  జై లవకుశతో తమన్నతో ఐటెంసాంగ్ పెట్టారు. ఇప్పుడు అరవింద సమేత సినిమాతో రెండోసారి కాజల్ ను రిపీట్ చేస్తున్నాడట. తమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.