అల్లు శిరీష్ – శ్రీకాంత్ అడ్డాల సినిమాపై క్లారిటీ

Wednesday,May 30,2018 - 11:05 by Z_CLU

ప్రస్తుతం మళయాళ బ్లాక్ బస్టర్ ABCD రీమేక్ పనుల్లో బిజీగా ఉన్నాడు అల్లు శిరీష్. జూన్ 18 నుండి ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. మరో పక్క దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తో అల్లు శిరీష్ సినిమా త్వరలో బిగిన్ కానుందనే న్యూస్ టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. అయితే ఈ విషయంలో క్లారిటీ ఇచ్చాడు అల్లు శిరీష్.

శ్రీకాంత్ అడ్డాలకు తనకు సినిమా విషయంలో అసలు డిస్కర్షనే జరగలేదని చెప్పిన అల్లు శిరీష్, అవి జస్ట్ రూమర్సే అని క్లియర్ చేసేశాడు. ఒకవేళ శ్రీకాంత్ అడ్డాల గీతా ఆర్ట్స్ బ్యానర్ లో స్టోరీ డిస్కస్ చేసి ఉండొచ్చేమో కానీ, ఆ సినిమా మాత్రం తనతో కాదని క్లారిటీ ఇచ్చేశాడు.

ABCD తో పాటు K.V. ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సూర్య సినిమాలో కీ రోల్ ప్లే చేసే చాన్స్ కొట్టేసిన అల్లు శిరీష్, ఇటు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోను ఇకపై బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ కానున్నాడు.