అల్లు శిరీష్ ఇంటర్వ్యూ...

Friday,December 29,2017 - 08:15 by Z_CLU

V.I. ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కిన అల్లు శిరీష్ ‘ఒక్కక్షణం’ సినిమా రిలీజైన ఫస్ట్ డే నుండే సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ప్యారలల్ లైఫ్ మెయిన్ కాన్సెప్ట్ గా, లవ్ వర్సెస్ డెస్టినీ అనే ట్యాగ్ లైన్ తో రిలీజైన ఈ థ్రిల్లర్ అతి యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ని కూడా ఇంప్రెస్ చేస్తుంది. ఈ సందర్భంగా అల్లు శిరీష్ ఈ సినిమా గురించి మీడియాతో మాట్లాడాడు. ఆ చిట్ చాట్ మీకోసం…

రెస్పాన్స్ చాలా బావుంది…

చాలా హ్యాప్పీగా ఉంది. ఒక కొత్త కాన్సెప్ట్ అటెంప్ట్ చేశాము, ఎలా రిసీవ్ చేసుకుంటారోనని చిన్న భయం ఉండేది. ఓవరాల్ గా రెస్పాన్స్ చాలా బావుంది. ముఖ్యంగా సినిమాలో స్టోరీతో పాటు హీరో గురించి మాట్లాడుతున్నారు. నా ప్రీవియస్ సినిమాలతో పోలిస్తే, ఈ సినిమాలో మెచ్యూరిటీ కనిపిస్తుంది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ లో… నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నా…

 

 

రిస్కైనా నమ్మేశాను…

శ్రీరస్తు శుభమస్తు సినిమా ఆనంద్ గారు ఈ సినిమా గురించి చెప్పినప్పుడు, ఇలాంటి కథని ఇప్పుడు వదులుకుంటే మళ్ళీ ఫ్యూచర్ లో దొరుకుతుందో లేదో అనే రేంజ్ లో ఎగ్జైటెడ్ అయిపోయా… సినిమా డిలే అయినా, ఆనంద్ గారు ఎక్కడిపోతావు చిన్నవాడా కంప్లీట్ చేసుకుని, మళ్ళీ ఈ స్టోరీని కూడా కంప్లీట్ గా రాసుకునే వరకు టైమ్ పట్టినా, వెయిట్ చేసి మరీ చేశాను.. అంతలా నమ్మాను కథని…

నాకూ అదే ఫీలింగ్ కలిగింది…

ప్యారలల్ లైఫ్ అనగానే నాక్కూడా కొత్తగా అనిపించడంతో పాటు అసలుంటుందా అనిపించింది. ఆ తరవాత అది సైన్స్ అని ఎప్పుడైతే అనిపించిందో.. ఇంతకన్నా కొత్తదనం ఉండదనిపించింది….

మాస్ హీరో అనిపించుకోవాలని మాత్రం కాదు….

నేను పెద్ద పెద్ద ఫైట్స్ చేసేసి మాస్ హీరో అనిపించుకోవాలని అనుకుని ఉంటేరివేంజ్ డ్రామా పిక్ చేసుకుని అలాంటి సినిమానే చేసి ఉండేవాణ్ణి, ఈ సినిమాలో స్క్రిప్ట్ డిమాండ్ చేసింది కాబట్టే యాక్షన్ ఎపిసోడ్ ఉంది. ఉన్న 3 ఫైట్స్ కూడా చాలా న్యాచురల్ గా ఉంటాయి.

ఆనంద్ చాలా బాగా హ్యాండిల్ చేశాడు…

కథలోంచి ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకూడదు. అలాగే అసలు కథ బిగిన్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టకూడదు. కాబట్టే ఫ్యామిలీ ఇమోషన్స్ కి అంత స్కోప్ ఇవ్వలేదు. మేము షూట్ చేసుకుని కూడా చివరికి తీసేశాం. సినిమాలో ఉండే కామెడీ కూడా కథతో పాటు ట్రావెల్ అవుతూంటుంది.

అందుకే మణిశర్మ గారు…

ప్రతి సినిమాకి సాంగ్స్ పెద్ద ఎసెటే. కానీ ఈ సినిమాకి సాంగ్స్ కన్నా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ అనిపించింది. అందుకే మణిశర్మ గారైతేనే కరెక్ట్ అనిపించింది.

 

నెక్స్ట్ సినిమా…

ప్రస్తుతానికి 2, 3 స్టోరీస్ విన్నాను. ఎందుకో కొత్త డైరెక్టర్స్ తో పని చేయాలని ఉంది. వాళ్ళ ఐడియాస్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉంటున్నాయి. ఆనంద్ కూడా 3 వ సినిమా అయినా, డెబ్యూ డైరెక్టర్ లా పని చేశాడు.

మల్టీస్టారర్ సినిమా…

తప్పకుండా చేస్తాను. కాకపోతే రైటర్సే అలాంటి స్టోరీస్ రాయడానికి ఇంటరెస్ట్ చూపించడం లేదు. ఒక హీరో ఒప్పుకునే ఇంకో హీరో దొరకడం కష్టం, జరగని దానికి కష్టపడటం ఎందుకని లైట్ తీసుకుంటున్నారు, నా దగ్గరికి మంచి కథ వస్తే మాత్రం నేను తప్పకుండా చేస్తా…