అల్లు శిరీష్ ఇంటర్వ్యూ

Wednesday,May 15,2019 - 02:18 by Z_CLU

ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తోంది ABCD సినిమా. మెగా హీరో అల్లు శిరీష్ నటించిన ఈ సినిమాపై ఆడియన్స్ లో అంచనాలున్నాయి. ఆ ఎక్స్ పెక్టేషన్స్ కు ఏమాత్రం తీసిపోని విధంగా సినిమా ఉంటుందంటున్నాడు శిరీష్. తన కెరీర్ లో ABCD మరో బిగ్ హిట్ అవుతుందంటున్నాడు.

రెండేళ్ల కిందట చూసిన సినిమా
ABCD ఒరిజినల్ వెర్షన్ ను రెండేళ్ల కిందట చూశాను. చాలా నచ్చింది. అయితే ఆ తర్వాత మళ్లీ అది చూడలేదు. రీమేక్ టైమ్ లో అస్సలు చూడలేదు. రీసెంట్ గా ABCD ఫస్ట్ కాపీ చూశాను. చాలా బాగుంది.

నన్నే చేయమని చాలామంది చెప్పారు
ఈ సినిమా చేయమని నాకు ఫస్ట్ చెప్పిన వ్యక్తి రామ్ చరణ్. ఆ తర్వాత మారుతి కూడా అదే చెప్పాడు. నేను చేస్తే బాగుంటుందని చేయమని ప్రోత్సహించాడు. వరుణ్ తేజ్ కూడా సినిమా చూసి ఈ సబ్జెక్ట్ నాకు కరెక్ట్ గా ఉంటుందని చెప్పాడు. నాకు కూడా సబ్జెక్ట్ నచ్చడంతో వెంటనే దిగిపోయాం.

డైరక్టర్ కు కూడా నచ్చి చేశాడు
సంజీవ్ రెడ్డి రైటింగ్ స్టయిల్ బాగుంది. రియల్ లైఫ్ లో జరుగుతున్న చిన్న చిన్న ఘటనల్ని కూడా బాగా రాస్తాడు. ఓ రీమేక్ సబ్జెక్ట్ తెచ్చాడు. అది అంతగా నచ్చలేదు. ABCD చూశారా బాగుంది అని అడిగాను. తనకు కూడా నచ్చింది. అలా ఈ ప్రాజెక్టులోకి వచ్చాడు.

డైరక్టర్ సంజీవ్ చెప్పిన అసలు కథ ఇది కాదు
నిజానికి ABCD కంటే ముందు సంజీవ్ చెప్పిన కథ చాలా పెద్ద డ్రామా. అందులో హీరోకు పెళ్లయి, పిల్లలు కూడా ఉంటారు. ఏడాదిన్నర కిందట విన్న కథ అది. ఇప్పుడు సరిగ్గా గుర్తురావడం లేదు. కానీ అలాంటి సినిమా చేయాలనిపించలేదు. అందుకే సంజీవ్ ను దాని బదులు ABCDలోకి తీసుకొచ్చాం.

నాని సినిమాతో ABCDకి సంబంధం లేదు
ABCD చూస్తే పిల్ల జమీందార్ గుర్తొచ్చిందని నాని అన్నాడు. కానీ ఈ రెండు సినిమాలకు ఎలాంటి సంబంధం లేదు. పిల్ల జమీందార్ లో ఆస్తి కోసం మనవడికి తాత కండిషన్ పెడతాడు. ABCDలో అలాంటివేం ఉండవు. ఇందులో తండ్రి అమెరికా నుంచి తన కొడుకును హైదరాబాద్ స్లమ్ లోకి తోసెస్తాడు.

మంచి నటుడిగా ఎదగడం కోసం..
గతంలో పూర్తిగా స్క్రిప్ట్ కు మాత్రమే ఫిక్స్ అయ్యేవాడ్ని. అది ఎలా ఉంటే అలా ఫాలో అయిపోయేవాడ్ని. కానీ ఇప్పుడు కామెడీ, లవ్ సీన్స్ లో నేను కొన్ని కొత్తగా చేస్తున్నాను. డ్రామాను మాత్రం నేను టచ్ చేయను. నా
పరిథిలో నేను కొత్తగా, అదనంగా ఎంత చేయగలనో అంతా చేస్తున్నాను. రావు రమేష్, మోహన్ లాల్ లాంటి నటులు సీన్లు మార్చరు. ఉన్న సన్నివేశాన్నే మరింతగా ఇంప్రూవ్ చేస్తారు. నేను అలా చేయాలనుకుంటున్నాను. ఒక నటుడిగా నాకు నేను ఓ పప్పెట్ లా ఉండదలుచుకోలేదు. ఓ డీసెంట్ యాక్టర్ గా ఉండే కంటే ఓ గుడ్ యాక్టర్
గా ఉండదలుచుకున్నాను.

ఇది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ కాదు
సినిమాలో చిన్న పొలిటికల్ ట్రాక్ కూడా ఉంది. కానీ అందులో మేం ఎలాంటి సందేశాలు ఇవ్వట్లేదు. నా పాత్రలో ఓ చిన్న మార్పు తీసుకొచ్చే దిశగా ఆ పొలిటికల్ ట్రాక్ ఉంటుంది. సినిమాలో అది అంతవరకే పరిమితం. పాలిటిక్స్ నా పాత్రను ఎలా మార్చాయనేది మాత్రమే ఉంటుంది.

ప్రొడక్షన్ లో జోక్యం ఉండదు
ప్రొడక్షన్ పై నాకు కాస్త అనుభవం ఉంది. కానీ నేను నటించే సినిమాల ప్రొడక్షన్ పనుల్లో మాత్రం నేను జోక్యం చేసుకోను. సినిమా బడ్జెట్ ఎంత అయింది, మూవీని ఎంతకు అమ్మారు లాంటి విషయాల్ని అస్సలు అడగను. నిర్మాతల్ని వాళ్ల పని వాళ్లను చేయనివ్వాలి.

చాలామంది ఫ్రెండ్స్ సహకరించారు
కృష్ణ చైతన్య, బీవీఎస్ రవి, పవన్ సాధినేని నాకు మంచి ఫ్రెండ్స్. వీళ్లందరికీ స్క్రిప్ట్ వినిపించాం. సత్యానంద్, గోపీమోహన్ గారికి కూడా స్క్రిప్ట్ వినిపించాం. ఇలా కొంతమంది వ్యక్తుల ఇన్-పుట్స్ కూడా తీసుకున్నాం. వాళ్లంతా ఈ సినిమా స్క్రిప్ట్ లో చాలా సహకరించారు. వాళ్లు చెప్పిన సూచనలు-సలహాలు అన్నీ పాటించాం. అవన్నీ ABCDలో కనిపిస్తాయి.

జుడా శాండీ నా సెలక్షన్
ఈ సినిమాకు జుడా శాండీ మ్యూజిక్ పెద్ద ప్లస్. ఓసారి కారులో వెళ్తూ అతడు కంపోజ్ చేసిన ఆ పాట విన్నాను. బాగా నచ్చింది. ABCDకి అతడ్ని తీసుకోవాలని అప్పుడే ఫిక్స్ అయ్యాను. పిలిచి మరీ అవకాశం ఇచ్చాను. టాలీవుడ్ ట్రెండ్ ఫాలో అవ్వొద్దని అప్పుడే చెప్పాను. రెగ్యులర్ తెలుగు టైపు సాంగ్స్ వద్దని చెప్పేశాను. అందుకే ABCD పాటలు అంత బాగా వచ్చాయి.

పేరుకే రీమేక్.. చాలా మార్పులున్నాయి
ఒరిజినల్ వెర్షన్ లో ట్యూన్స్ ఒక్కటి కూడా వాడలేదు. అన్నీ కొత్త ట్యూన్స్. కేవలం సాంగ్స్ మాత్రమే కాదు, సినిమాలో సీన్స్ కూడా ఒరిజినల్ నుంచి ఓ 15 మాత్రమే తీసుకున్నాం. మిగతా సీన్స్ అన్నీ మేం కొత్తగా రాసుకున్నాం. సినిమా సోల్ మాత్రమే తీసుకున్నాం. మలయాళం వెర్షన్ లో హీరోయిన్, విలన్ పాత్రలు లేవు. తెలుగులో పెట్టాం. ఒరిజినల్ సినిమా చూసిన వాళ్లకు కూడా మా ABCD కొత్తగా కనిపిస్తుంది.

నాకే ఎందుకిలా జరుగుతోంది?
నా సినిమాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయో నాకైతే అర్థం కావడం లేదు. అది నా దురదృష్టం అనుకోవాలేమో. ABCD సినిమాను గతేడాది జూన్ లో స్టార్ట్ చేశాం. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ లేట్ అయిపోయింది. నా వైపు నుంచి ఆలస్యం అనేది ఎప్పుడూ ఉండదు. ఎప్పుడు అడిగినా కాల్షీట్లు ఇస్తున్నాను. కానీ లేట్ అవుతున్నాయి. ఈసారి మరింత జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నాను.

అప్ కమింగ్ మూవీస్
నా బ్యానర్ లో ప్రస్తుతానికైతే సినిమా లేదు. శ్రీరస్తు శుభమస్తు తర్వాత మళ్లీ ఎప్పుడు చేస్తానో తెలీదు. ABCD రిలీజ్ తర్వాత నిర్ణయం తీసుకుంటాను. వచ్చే ఏడాదిలో 2 సినిమాలు చేయాలనుకుంటున్నాను. వీటిలో ఒక సినిమా స్క్రిప్ట్ ఆల్రెడీ లాక్ అయింది. ఇదొక మంచి లవ్ స్టోరీ.