అల్లు శిరీష్ బర్త్ డే స్పెషల్

Wednesday,May 30,2018 - 09:10 by Z_CLU

మెగా కాంపౌండ్ నుంచి చాలా మంది హీరోలున్నారు. ఎవరి ప్రత్యేకత వారిది. అల్లు శిరీష్ కూడా అంతే. తను తలుచుకుంటే ఫుల్ లెంగ్త్ కమర్షియల్ సినిమాలు చేయగలడు. స్టార్ డైరక్టర్లను లైన్లో పెట్టగలడు. కానీ నటుడిగా తననుతాను నిరూపించుకోవాలనుకుంటున్నాడు. అందుకే తనకు సూట్ అయ్యే పాత్రలు మాత్రమే చేస్తున్నాడు. ఈరోజు ఈ మెగా యంగ్ హీరో తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు.

చిరంజీవి హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ ప్రతిబంధ్ లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన అల్లు శిరీష్.. గౌరవం సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఓ కమర్షియల్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యే బ్యాకప్ ఉన్నప్పటికీ.. మంచి సందేశాత్మక చిత్రంతో ప్రేక్షకులముందుకొచ్చి మార్కులు కొట్టేశాడు.

గౌరవం తర్వాత శిరీష్ చేసిన కొత్తజంట సినిమా అతడ్ని కమర్షియల్ హీరోగా నిలిపింది. శిరీష్ కెరీర్ లో మొట్టమొదటి సూపర్ హిట్ మూవీ ఇది. ఆ తర్వాత శ్రీరస్తు శుభమస్తు సినిమాతో మరో సూపర్ హిట్ కొట్టాడు. రీసెంట్ గా వచ్చిన ఒక్క క్షణం మూవీతో మరో సక్సెస్ అందుకున్నాడు.

ఇలా వరుసగా హ్యాట్రిక్ విజయాలు అందుకున్న శిరీష్.. ప్రస్తుతం 1971-భారత సరిహద్దు అనే సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. దీంతో పాటు ఏబీసీడీ అనే మలయాళ రీమేక్ సినిమా కూడా చేయబోతున్నట్టు ఎనౌన్స్ చేశాడు. మరోవైపు సూర్య హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో కీలక పాత్ర కూడా చేస్తున్నాడు శిరీష్. ఇలా విలక్షణంగా కెరీర్ ప్లాన్ చేసుకున్న అల్లు శిరీష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తోంది జీ సినిమాలు.