ఓవర్సీలో మహానటి మరో రికార్డు

Tuesday,May 29,2018 - 03:43 by Z_CLU

1 మిలియన్ డాలర్ క్లబ్.. 2 మిలియన్ డాలర్ క్లబ్.. ఈ రెండు క్లబ్బుల్లోకి అవలీలగా చేరిపోయింది మహానటి సినిమా.తాజాగా ఇప్పుడు 2.5 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది. ఓవర్సీస్ లో ఇవాళ్టితో 3 వారాల రన్ పూర్తిచేసుకుంది ఈ సినిమా. ఓవైపు 3 వారాలు పూర్తిచేసుకుంటూనే మరోవైపు 2.5 మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరైంది.

ఈ మూడు వారాల్లో ఖైదీ నంబర్ 150, అ..ఆ, ఫిదా సినిమా లైఫ్ టైం వసూళ్లను క్రాస్ చేసింది మహానటి. ప్రస్తుతంఓవర్సీస్ లో టాప్-10 జాబితాలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. మరో వారం రోజుల పాటు ఓవర్సీస్ లో మహానటి హవా కొనసాగే అవకాశాలున్నాయి.

ఓవర్సీస్ లో టాప్-10 సినిమాలు

 

బాహుబలి 2 – 20,571,695 డాలర్లు

బాహుబలి 1 – 6,861,819 డాలర్లు

రంగస్థలం – 3,513,450 డాలర్లు

భరత్ అనే నేను – 3,414,795 డాలర్లు

శ్రీమంతుడు – 2,890,786 డాలర్లు

మహానటి – 2,500,000 డాలర్లు

అ..ఆ – 2,449,174 డాలర్లు

ఖైదీ నంబర్ 150 – 2,447,043 డాలర్లు

ఫిదా – 2,066,937 డాలర్లు

అజ్ఞాతవాసి – 2,065,527 డాలర్లు