అల్లు అర్జున్ సుకుమార్ మూవీ అప్డేట్స్

Friday,May 10,2019 - 12:10 by Z_CLU

కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలిచిపోవాలన్న ఉద్దేశ్యంతో తన 20వ సినిమాను సుకుమార్ చేతిలో పెట్టాడు అల్లు అర్జున్.  ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి  ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే అల్లు అర్జున్ సరసన రష్మికను హీరోయిన్ గా ఫైనల్ చేసుకున్నారు. మిగతా నటీనటులు కూడా ఫైనల్ చేసే పనిలో బిజీ గా ఉంది సుక్కు అండ్ టీమ్. 

ఈ సినిమా  మే 11 న పూజా కార్యక్రమాలతో లాంచ్ చేయాలని భావించారు కానీ ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నారని తెలుస్తుంది. ఈ నెల 15 తర్వాత ఈ సినిమా లాంచ్ కానుందని సమాచారం. ఆగస్ట్ నుండి షూట్ స్టార్ట్ చేసే ప్లాన్ లో ఉన్నారు.  

సుకుమార్  ఈ సినిమాను ఎర్ర చందనం బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ డ్రామాగా తెరకెక్కించనున్నాడని, ఇప్పటికే  కడప సమీపంలో ఉన్న తలకోన వంటి ఫారెస్ట్ లో కొన్ని లొకేషన్స్ ని ఫిక్స్ చేశాడని తెలుస్తుంది. మరి ఈ లెక్కల మాస్టారు ఈ సినిమాలో బన్నీని ఎలాంటి డిఫరెంట్ క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేస్తాడో చూడాలి.  మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్.