తెలిసిపోతుంది... ఇదంతా నాని ప్లానే!!

Friday,May 10,2019 - 11:58 by Z_CLU

చేసే ప్రతి సినిమాతో నాని రేంజ్ ఒక్కో మెట్టు పెరుగుతూనే ఉంది. డిఫెరెంట్ కథల్ని ఎంచుకోవడం తనలోని పర్ఫామెన్స్ లెవెల్స్ ని ఎలివేట్ చేస్తే, ఆ ప్రతి కథలో ఎమోషన్ ఉండేలా చూసుకోవడం నానిని న్యాచురల్ గానే ప్రతి ఆడియెన్ కి సొంత మనిషి అనే స్థాయిలో రిలేషన్ బిల్డ్ చేసింది. అందుకే నాని 25 వ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కానీ నాని ఇక్కడే ఇంట్రెస్టింగ్ డెసిషన్ తీసుకున్నాడు. 

సినిమా సక్సెసా.. ఫెయిల్యూరా పెద్దగా పట్టించుకోడు కానీ ఫ్యాన్స్ ని ఎట్టి పరిస్థితుల్లో డిజప్పాయింట్ చేయకూడదనే రూల్ పెట్టుకుంటాడు. అందుకే తన 25 వ సినిమా చుట్టూ ఆడియెన్స్ లో డిస్కషన్స్ కూడా గట్టిగా స్టార్ట్ చేయకముందే మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో సుధీర్ బాబు సినిమాలో చేస్తున్నట్టు అనౌన్స్ చేశాడు. 

నానిని నటుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఇంద్రగంటి 25 వ సినిమాకి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు అనగానే ఇది కూడా ఆల్మోస్ట్ ‘జెంటిల్ మెన్’ తరహా సినిమా అయి తీరుతుందని ఫీలయ్యారంతా.. కట్ చేస్తే సీన్ మారింది. ‘V’ సినిమాలో నాని పవర్ ఫుల్ క్యారెక్టర్ ప్లే చేయబోతున్నాడు. కానీ సినిమా మాత్రం సుధీర్ బాబుదే. ఈ విషయాన్ని నాని స్వయంగా ఒప్పుకున్నాడు. మహా అయితే నాని ఈ సినిమాలో 15 నిమిషాల పాటు కనిపిస్తాడు అంతే. కానీ కథలోని సబ్జెక్ట్ మాత్రం ఈ క్యారెక్టర్ చుట్టే తిరుగుతుంది.    

అయితే ఇక్కడ విషయం ‘V’ సినిమా గురించి కాదు. నాని 25 వ సినిమా గురించి. 25 వ సినిమా కాబట్టి డెఫ్ఫినెట్ గా మరింత భారీ స్థాయిలో సినిమా చేస్తాడేమో అనే ఆలోచన బిగిన్ కూడా అవ్వకముందే తన ఫేవరేట్ డైరెక్టర్ సినిమాలో ఓ క్యారెక్టర్ చేసి సరిపెట్టుకుంటున్నాడు నాని. ఇది మాత్రం పక్కా నాని వేసుకున్న ప్లానింగే… మైల్ స్టోన్ మూవీ అనగానే క్రియేట్ అయ్యే వైబ్స్ మధ్య ఏదో స్పెషల్ సినిమా చేసేశాడు అనిపించుకోకుండా, ఫ్యాన్స్ ని డిఫెరెంట్ గా ఎంటర్ టైన్ చేద్దామని ఈ డెసిషన్ తీసుకున్నాడు నాని.