బన్నీ-సుకుమార్ మూవీ అప్ డేట్స్

Friday,January 17,2020 - 02:00 by Z_CLU

త్వరలోనే సుకుమార్ దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు బన్నీ. ఈ సినిమాకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇక బన్నీ రావడమే ఆలస్యం అనుకున్నారంతా. కానీ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలై చాన్నాళ్లయింది. ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తయిన విషయాన్ని సుకుమార్ బయటపెట్టాడు.

కనుమ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్లిన సుకుమార్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించాడు. బన్నీ లేకుండా సినిమాకు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేసినట్టు ప్రకటించాడు. ఇక బన్నీ వచ్చిన తర్వాత సెకెండ్ షెడ్యూల్ మొదలవుతుందంటున్నాడు. అన్నీ కుదిరితే ఫిబ్రవరి మొదటి వారం నుంచి బన్నీ సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉందంటున్నాడు సుక్కూ.

మరోవైపు ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయి. దేవిశ్రీప్రసాద్ ఇప్పటికే 2 ట్యూన్స్ ఫైనలైజ్ చేసినట్టు తెలుస్తోంది. గంధపు చక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్, లారీ డ్రైవర్ గా కనిపించబోతున్నాడట. ఈ వివరాల్ని మాత్రం సుకుమార్ నిర్థారించలేదు.