సుమంత్ కొత్త సినిమా

Thursday,May 30,2019 - 06:33 by Z_CLU

ఇదం జగత్, సుబ్రమణ్యపురం సినిమాల తర్వాత షార్ట్ గ్యాప్ తీసుకున్న అక్కినేని హీరో సుమంత్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాతో సంతోష్ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

సంజన ప్రొడక్షన్స్-సాయి కృష్ణా ప్రొడక్షన్స్ బ్యానర్లపై పి.జగన్ మోహన్ రావు-డి.ఎస్.రావు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నారు. సుమంత్ సరసన సిమ్రత్ హీరోయిన్ గా నటించే ఈ చిత్రం త్వరలోనే సెట్స్ కు వెళ్లనుంది.

ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ సినిమాలో సుమంత్ కొత్త కోణంలో, సరికొత్త గెటప్ లో కనిపిస్తాడట. “ఈ ప్రపంచంలో ఎవరూ చెడ్డ కాదు. ఎవరూ మంచి కాదు. పరిస్థితుల ప్రభావంతోనే మంచివాళ్లుగా, చెడ్డవాళ్లుగా మారతారు” అనేది ఈ సినిమా బేసిక్ పాయింట్.