చిన్న రౌడీ: దొరసాని ఫస్ట్ లుక్ రిలీజ్

Thursday,May 30,2019 - 04:27 by Z_CLU

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడు హీరో అయ్యాడు. ఆనంద్ దేవరకొండ నటించిన దొరసాని సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈరోజు ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అమాయకంగా కనిపిస్తూ, రియలిస్టిక్ లుక్ లో ఆనంద్ దేవరకొండ అందర్నీ ఎట్రాక్ట్ చేస్తున్నాడు. దేవరకొండ అభిమానులంతా సోషల్ మీడియాలో ఆనంద్ ను చిన్న రౌడీ అంటూ ముద్దుగా పిలవడం స్టార్ట్ చేశారు.

ఇదే ఫస్ట్ లుక్ లో శివాత్మిక కూడా ఉంది. రాజశేఖర్ కూతురు శివాత్మిక ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఆమె లుక్స్ కూడా చాలా బాగున్నాయి. సైడ్ యాంగిల్ లో చూస్తే అచ్చం జీవితలా కనిపిస్తోంది.
హీరోహీరోయిన్లు ఇద్దరూ ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ నుంచి రావడంతో.. ఆనంద్, శివాత్మిక ఫస్ట్ లుక్స్ ను సెపరేట్ గా రిలీజ్ చేస్తారని అంతా భావించారు. కానీ ఒకే స్టిల్ లో ఇద్దర్నీ పరిచయం చేశారు.

టైటిల్ కు తగ్గట్టుగానే ఇది తెలంగాణలోని ఓ ప్రాంతంలో 80 దశకంలో జరిగిన కథగా వస్తోంది. కారులో కూర్చున్న దొరసానిని ఆ పక్కనే సైకిల్ పై వచ్చిన రాజు ఆరాధనగా చూస్తున్న స్టిల్, ఇదొక ఎమోషనల్ స్టోరీ అనే విషయాన్ని చెప్పకనే చెబుతోంది.

సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్ , బిగ్ బెన్ సంస్థ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంతో మహేంద్ర దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. సినిమా టీజర్ ను జూన్ 6 న విడుదల చేస్తారు.