‘హలో’ సాంగ్ కోసం రూ.2 కోట్లు సెట్

Friday,December 08,2017 - 12:45 by Z_CLU

రీసెంట్ గా రిలీజైన అఖిల్ ‘హలో’ మూవీ వెడ్డింగ్ సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. సినిమాలో హైలెట్ కానున్న ఇమోషన్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ ని కాసేపు పక్కన పెడితే, సినిమా రిలీజ్ కి ముందే ఎట్రాక్ట్ చేస్తున్న ఈ వెడ్డింగ్ సాంగ్ సినిమా స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేయడమే కాదు, మూవీ రికార్డ్ బ్రేకింగ్ సక్సెస్ కి కావాల్సినంత బజ్ క్రియేట్ చేస్తుంది.

ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ నంబియార్ నేతృత్వంలో 2 కోట్ల బడ్జెట్ తో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా, దాదాపు 60 మంది వారం రోజులు కష్టపడి కట్టిన ఈ సెట్ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేయడంలో సూపర్ సక్సెస్ అయింది. రమ్యకృష్ణ, జగపతి బాబుతో పాటు సినిమాలో లీడ్ రోల్స్ ప్లే చేసిన అఖిల్, కళ్యాణి కెమిస్ట్రీని హైలెట్ చేస్తున్న ఈ సాంగ్, సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

 

అఖిల్ చార్మ్ హైలెట్ అయ్యేలా డిజైన్ అయిన కాస్ట్యూమ్స్ నుండి బిగిన్ అయితే, వృంద మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్స్ సాంగ్ లో హైలెట్ గా నిలుస్తున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మించిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ కంపోజ్ చేశాడు. ఈ సినిమా ఆడియో రిలీజ్ ని డిసెంబర్ 10 న వైజాగ్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయనుంది సినిమా యూనిట్.