హాలీవుడ్ లో అఖిల్ ‘హలో’ మార్క్

Monday,May 14,2018 - 02:10 by Z_CLU

విక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కిన అఖిల్ సినిమా ‘హలో’ మరో రేర్ మైల్ స్టోన్ ని రీచ్ అయింది. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా, టాలీవుడ్ నే కాదు ఏకంగా హాలీవుడ్ ని కూడా ఇంప్రెస్ చేసింది. టారస్  వరల్డ్ స్టంట్ అవార్డ్స్ లో ‘బెస్ట్ యాక్షన్ ఇన్ ఫారిన్ ఫిల్మ్’ క్యాటగిరీలో నామినీ అయింది ‘హలో’ సినిమా.

 

ఈ సినిమాతోనే టాలీవుడ్ లో పార్కోర్ స్టంట్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు ఫిల్మ్ మేకర్స్. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ బాబ్ బ్రౌన్ కంపోజ్ చేసిన ఫైట్స్, యూత్ ని మెస్మరైజ్ చేయడంలో సూపర్ సక్సెస్ అయ్యాయి. ఈ స్టంట్స్ కోసం అఖిల్ స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకోవడం విశేషం.

రెడ్ బుల్ ఫౌండర్ డైట్రిచ్ మెట్షిజ్ ఆధ్వర్యంలో ఈ అవార్డులు నిర్వహిస్తారు. గత 18 ఏళ్లుగా ప్రతి సంవత్సరం లాస్ ఏంజిల్స్ వేదికగా  బెస్ట్ స్టంట్ పర్ఫామర్స్ కి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది.