హలో మూవీ టాప్-10 హైలెట్స్

Wednesday,December 20,2017 - 02:46 by Z_CLU

డిసెంబర్ 22న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది అఖిల్ హలో. ఇప్పటికే ఆడియో బ్లాక్ బస్టర్ అనిపించుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ అడ్వెంచరస్ లవ్ ఎంటర్ టైనర్ లో టాప్-10 హైలెట్స్.

 

కథ, స్క్రీన్ ప్లే : చిన్నప్పుడు విడిపోయిన సోల్ మేట్ ని హీరో ఎలా కలుసుకున్నాడు అనేది హలో మూవీ థీమ్ అయితే, ఈ థీమ్ కి లైఫ్ ఆడ్ చేసింది విక్రమ్ కుమార్ మార్క్ స్క్రీన్ ప్లే. ఈ రెండూ లేకపోతే అసలు ఈ ప్రాజెక్టే సెట్స్ పైకి వచ్చేది కాదు. అందుకే హలో సినిమాకు సంబంధించి ఫస్ట్ హైలెట్ ఇదే.

 

హాలీవుడ్ రేంజ్ స్టంట్స్ : హలో సినిమాకు హైప్ తీసుకొచ్చిన మరో క్రేజీ ఎలిమెంట్ స్టంట్స్. హాలీవుడ్ కు మాత్రమే పరిమితమైన పార్-కోర్ అనే యాక్షన్ థీమ్ ను హలోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఎలాంటి ఆధారం లేకుండా, గాల్లో ఎగురుతూ చేసే ఫైట్స్ ఇవి. దీని కోసం హాలీవుడ్ నుంచి బాబ్ బ్రౌన్ అనే కొరియోగ్రాఫర్ ను తీసుకొచ్చారు. సినిమాలో దాదాపు 40 నిమిషాల పాటు ఉండే ఈ యాక్షన్ ఎపిసోడ్స్ మరో మేజర్ హైలెట్. అంతేకాదు.. హైదరాబాద్ మెట్రో రైలులో షూట్ చేసిన మొట్టమొదటి సినిమా ఇది.

 

అఖిల్ లుక్స్: హలో సినిమాకు మరింత అందం తీసుకొచ్చాడు అఖిల్. అందానికి మారుపేరుగా నిలిచిన అక్కినేని కాంపౌండ్ నుంచి వచ్చిన అఖిల్, ఆ ట్యాగ్ లైన్ కు అతికినట్టు సరిపోయాడు. లుక్స్ లో ది బెస్ట్ అనిపించుకున్నాడు. డాన్స్ లో టాప్-క్లాస్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక యాక్షన్ ఎపిసోడ్స్ కోసం అఖిల్ ఎంత కష్టపడ్డాడనే విషయాన్ని సినిమా చూసిన ప్రతి ఒక్కరు గుర్తిస్తారు.

 

విక్రమ్ కుమార్ డైరెక్షన్ :  విక్రమ్ కుమార్ సినిమా అంటేనే సమ్ థింగ్ స్పెషల్.  సింపుల్ స్టోరీకి ఎమోషనల్ మేజిక్ ని యాడ్ చేయడం ఇతడి స్టయిల్. మనం సినిమా సక్సెస్ తో తన స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేసిన  విక్రమ్ కుమార్ హలో సినిమాను కూడా అదే రేంజ్ లో తీశాడు. హలోపై భారీగా అంచనాలు పెరగడానికి ఒక విధంగా విక్రమ్ కుమార్ కూడా కారణం.

 

అన్నపూర్ణ  ప్రొడక్షన్ వ్యాల్యూస్: అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఓ సినిమా వస్తుందంటే ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. అలాంటిది నాగార్జున నిర్మాతగా స్వయంగా నాగ్ తనయుడు అఖిల్ హీరోగా సినిమా అంటే ప్రొడక్షన్ విలువలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థంచేసుకోవచ్చు. నిజమే.. అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కింది హలో సినిమా. ఇందులో మెరిసే మెరిసే అనే ఒకే పాట కోసం.. నాగార్జున 2 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారంటే ప్రొడక్షన్  వాల్యూస్ ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

 

అనూప్ మ్యూజిక్ : హలో టైటిల్ సాంగ్, అనగనగా ఒక ఊరు, మెరిసే మెరిసే సాంగ్స్ ఇప్పటికే యూత్ టాప్ లిస్ట్ లో చేరిపోయాయి. ఎక్కడ విన్నా ఈ పాటలే. తన మ్యూజిక్ తో అంతటి మేజిక్ కు క్రియేట్ చేసిన వ్యక్తి అనూప్ రూబెన్స్. సింపుల్ గా చెప్పాలంటే హలోలో పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. దీనికి తోడు అఖిల్ స్వయంగా ఓ పాట పాడడం హలోకు మరో హైలెట్.

 

హీరోయిన్: ఒకప్పటి టాప్ హీరోయిన్ లిజి, స్టార్ డైరక్టర్ ప్రియదర్శన్ దంపతుల కూతురు కల్యాణి ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయమౌతోంది. ఆమె లుక్స్ సినిమాకు ఓ ఫ్రెష్ లుక్ తీసుకొచ్చాయి. యాక్టింగ్ లో కూడా కల్యాణి అదరగొట్టేసింది. అఖిల్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ కల్యాణిదే.

 

రమ్యకృష్ణ – జగపతి బాబు: అద్భుతమైన కాంబినేషన్ ఇది. ఇంత అనుభవం ఉన్న సీనియర్లు హలో సినిమాలో అఖిల్ కు అమ్మానాన్నగా నటించారు. క్యారెక్టర్ లో వెయిట్ లేకపోతే కమిట్ అవ్వదు రమ్యకృష్ణ. అటు జగపతి బాబు కూడా అంతే. ఇలాంటి ఇద్దరు సీనియర్లు హలోలో నటించారంటే కంటెంట్ పరంగా సినిమా ఎంత రిచ్ గా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు.

 

సెల్ ఫోన్ ఎలిమెంట్: హీరో తన సోల్ మేట్ ని కలుసుకోవడానికి ఉన్న ఏకైక ఆధారం మొబైల్. అలాంటి కీలకమైన సెల్ ఫోన్ మిస్ అవుతుంది. ఆ ఫోన్ ఏమైంది, హీరో దాన్ని తిరిగి దక్కించుకున్నాడా..? హలో సినిమాలో ఇలా కీలక పాత్ర పోషించింది ఓ సెల్ ఫోన్.

 

నాగార్జున వాయిస్ ఓవర్ : లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నాగార్జున వాయిస్ ఓవర్. మోస్ట్ ఎక్సయిటెడ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన హలో సినిమాకు నాగ్ వాయిస్ ఓవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రొడ్యూసర్ గా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించిన నాగ్.. తన వాయిస్ తో కూడా హలో కు ప్లస్ అయ్యాడు.