షూటింగ్ లో గాయపడ్డ కల్యాణ్ రామ్

Friday,December 08,2017 - 02:09 by Z_CLU

హీరో కల్యాణ్ రామ్ గాయపడ్డాడు. వికారాబాద్ రైల్వే స్టేషన్ లో ఓ యాక్షన్ ఎపిసోడ్ తీస్తుండగా ప్రమాదవశాత్తూ గాయపడ్డాడు కల్యాణ్ రామ్. వెంటనే అతడికి ప్రాధమిక చికిత్స చేసి హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ప్రస్తుతం కల్యాణ్ రామ్ కోలుకున్నాడు. జయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి ఈ ఘటన జరిగింది

ప్రస్తుతం కల్యాణ్ రామ్ 2 సినిమాలు చేస్తున్నాడు. జయేంద్ర దర్శకత్వంలో మూవీ చేస్తూనే, ఉపేంద్ర అనే కుర్రాడ్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ మరో సినిమా చేస్తున్నాడు. గాయం కారణంగా ఈ రెండు సినిమాల షూటింగ్స్ పోస్ట్ పోన్ అవుతాయని అంతా ఊహించారు. కానీ కల్యామ్ రామ్ త్వరగానే కోలుకున్నాడు. షూటింగ్స్ లో ఎలాంటి జాప్యం ఉండదని మేకర్స్ ప్రకటించారు.