టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసిన అఖిల్

Friday,December 22,2017 - 02:40 by Z_CLU

చేసిన రెండో సినిమాతోనే టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశాడు అక్కినేని అఖిల్. హలో సినిమాతో పార్కోర్ అనే ఫైట్ ను పరిశ్రమకు పరిచయం చేశాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజైన హలో సినిమాలో అఖిల్  చేసిన పార్కోర్ స్టయిల్ ఫైట్స్ యూత్ కు ఇనిస్టెంట్ గా కనెక్ట్ అయ్యాయి.

ఎలాంటి ఆధారం లేకుండా, ఎదురుగా ఎన్ని అడ్డంకులున్నప్పటికీ గాల్లో ఎగురుతూ దూసుకుపోవడం పార్కోర్ స్టయిల్. ఇలాంటి ఫైట్స్ ను టాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ పెర్ఫార్మ్ చేయలేరు. అందుకే హలో సినిమా కోసం బాలీవుడ్ నుంచి బాబ్ బ్రౌన్ అనే యాక్షన్ కొరియోగ్రాఫర్ ను తీసుకొచ్చారు. మూవీలో పార్కోర్ స్టంట్స్ అందర్నీ ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తున్నాయి.

 

ప్రస్తుతం హలో సినిమాకు వరల్డ్ వైడ్ పాజిటివ్ టాక్ వచ్చింది. అఖిల్ యాక్టింగ్, విక్రమ్ కుమార్ టేకింగ్ కు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మాతగా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది హలో సినిమా.