సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకున్న ‘హలో’

Tuesday,December 19,2017 - 03:50 by Z_CLU

అఖిల్ ‘హలో’ సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుంది. విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో అల్టిమేట్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా క్లీన్ U సర్టిఫికెట్ పొందింది. డిసెంబర్ 22 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేస్తుంది.

ఇప్పటికే ఆడియో సూపర్ హిట్ అనిపించుకుంటున్న ‘హలో’ యూత్ ని ఎట్రాక్ట్ చేయడంలో సూపర్ సక్సెస్ అయింది. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమాకి క్రియేట్ అయిన క్రేజ్ చూస్తుంటే, అఖిల్ కరియర్ లో ‘హలో’ మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోవడం గ్యారంటీ అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

 

రేపు గ్రాండ్ గా జరగనున్న ప్రమోషనల్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా అటెండ్ కానున్న ఈ సినిమా మ్యాగ్జిమం అన్ని ఫార్మాలిటీస్ ని కంప్లీట్ చేసుకుని రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మించాడు.