మాస్ డైరక్టర్ తో అఖిల్ మూవీ?

Sunday,July 02,2017 - 02:02 by Z_CLU

ఫస్ట్ సినిమా ‘అఖిల్’ తర్వాత భారీ గ్యాప్ తీసుకున్న అక్కినేని యంగ్ హీరో ప్రెజెంట్ విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో రెండో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తర్వాత బోయపాటి తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట ఈ సిసింద్రీ. ప్రెజెంట్ విక్రమ్ కుమార్ తో అఖిల్ సినిమా సెట్స్ పై ఉండగానే డైరెక్టర్ బోయపాటి శ్రీను తో మూడో సినిమా ఫిక్స్ అయ్యిందనే వార్త వినిపిస్తుంది.

ప్రెజెంట్ ‘జయ జానకి నాయక’ సినిమా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీ గా ఉన్న బోయపాటి ఈ సినిమా తర్వాత చిరు తో ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే చిరు ‘ఉయ్యాల వాడ నర్సింహా రెడ్డి’ సినిమా ప్రీ ప్రొడక్షన్ కి చాలా టైం పడుతుండటం, సెట్ పైకి వెళ్ళడానికి లేట్ అవుతుండడంతో బోయపాటి ఈ లోపు అఖిల్ తో ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యాడనే టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే అఖిల్ సినిమా కోసం బోయపాటి నాగ్ నుంచి అడ్వాన్స్ కూడా తీసుకున్నాడని సమాచారం. సో అన్ని కుదిరితే అఖిల్ మూడో సినిమా బోయపాటి డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉంది..