నాగచైతన్య కొత్త సినిమా ఫస్ట్ లుక్

Sunday,July 02,2017 - 12:58 by Z_CLU

కృష్ణ మరిముత్తు దర్శకత్వంలో నాగచైతన్య ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. టైటిల్ కూడా ఎనౌన్స్ చేశారు. ఈ మూవీకి యుద్ధం శరణం అనే టైటిల్ పెట్టారు. ఫస్ట్ లుక్ గా కీలకమైన నటీనటులందరి ఫొటోలు విడుదల చేశారు.

ఈ సినిమాతో శ్రీకాంత్ విలన్ గా మరోసారి టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడనే టాక్ ఎప్పట్నుంచో ఉంది. ఆ రూమర్ కు తగ్గట్టే యుద్ధం శరణం ఫస్ట్ లుక్ తో రఫ్ గా కనిపిస్తున్నాడు శ్రీకాంత్. బ్యాక్ గ్రౌండ్ లో రేవతి, రావు రమేష్ కనిపిస్తున్నారు. సాయికొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమాను ఆగస్ట్ లో విడుదల చేయాలని నిర్ణయించారు.

లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీతో నాగచైతన్య మరోసారి యాక్షన్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది.